ఆగస్టు 1వ తేదీ నుంచి మంగళవారం నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. దీంతో ఢిల్లీలో ప్రస్తుత సిలిండర్ ధర రూ.1680కి చేరింది.

Oil Marketing Companies Reduced Prices Commercial LPG Gas Cylinders From Today
ఆగస్టు 1వ తేదీ నుంచి మంగళవారం నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్(Commercial LPG Gas Cylinder) ధరలను చమురు కంపెనీలు(Oil Marketing Companies) తగ్గించాయి. దీంతో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. దీంతో ఢిల్లీ(Delhi)లో ప్రస్తుత సిలిండర్ ధర రూ.1680కి చేరింది.
చమురు కంపెనీలు ప్రతినెలా 1వ తేదీ, 16వ తేదీల్లో ఎల్‌పిజి ధర(Price)ను మారుస్తాయి. జూలైలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు రూ.7 పెంచాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,780కి పెరిగింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల(Domestic LPG Gas Cylinder) ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకున్నాయి. ఇందులో వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో గరిష్ట ప్రభావం కనిపించింది. ఈ ఏడాది మార్చి(March)లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యూనిట్‌కు రూ.350.50 పెంచారు. అయితే వాటి ధరలను మే(May) నెలలో రూ.171.50 తగ్గించారు.
