పూరీ జగన్నాథ్(Puri jagannath) ఆలయంలోని రత్నభండార్‌లోని(ratna bhandagar) రహస్యగదిని(secret room) ఈరోజు తెరిచారు.

ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు. ఈరోజు 9.51 నిమిషాలకు రహస్య గదిని తెరిచారు. ఐదు రోజుల్లో మూడో గదిని తెరిచారు. ఈ వారంలోనే రత్నభండార్‌ను తెరవడం ఇది రెండోసారి. రహస్యగదిని తెరిచేకంటే ముందు జగన్నాథుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం నియమించిన సూపర్‌వైజరీ కమిటీ రత్నభండార్‌లోకి అడుగుపెట్టింది. జులై 14న బయటి గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం వరకు రహస్య గదిలోని విలువైన వస్తువులను తరలిస్తామని కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంత్ రాథ్ తెలిపారు. పూరి రాజు గజపతి మహరాజ దివ్యసింగ్ దేబ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తున్నారు. పాములు పట్టేవారితో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారమే 11 మంది సభ్యులు బృందం రత్నభండార్‌లోని రహస్య గదిలోకి ప్రవేశించారు. ప్రస్తుతం లొపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను ఖటేషేజా రూమ్‌కు తరలిస్తున్నారు
విలువైన వస్తువులను తరలించే ప్రక్రియను ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారులు చిత్రీకరిస్తున్నారు. నిధిని తరలించిన తర్వాత ఈ రత్నభండార్‌ను మరమ్మతుల కోసం పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. మరమ్మతులు పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూంల నుంచి నిధిని మళ్లీ రత్నభండార్‌కు తరలిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిధులను లెక్కింపు చేపట్టనున్నారు. రహస్యగది నిధి లెక్కింపునకు 30-40 రోజుల సమయం పట్టవచ్చని ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ ప్రకటించారు. 46 ఏళ్ల తర్వాత రత్నభండార్‌ను తెరిచి నిధులను లెక్కిస్తామని చెప్పడంతో దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథుడి ఆలయ నిధులపై ఆసక్తి నెలకొంది. కాగా రత్నభండార్‌లోని నిధికి సంబంధించిన మూడో గదిని (రహస్య గది) తెరవడం ఇదే మొదటి సారి అని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ గదిని తెరవలేదని అధికారులు వెల్లడించారు.
