ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పూరీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనితో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుమారు రూ. 8,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వహించే ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ పూరీకి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) గురువారం పూరీ-హౌరా(Howrah-Puri ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express)ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనితో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుమారు రూ. 8,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రధాని చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) నిర్వహించే ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ పూరీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(Naveen Patnaik) కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ మోడ్(Virtual Mode)లో పాల్గొంటారు. పూరీ-హౌరా వందే ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రారంభంతో రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఇది హౌరాలో ఉదయం 6.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు పూరీకి చేరుకుంటుంది. తిరిగి పూరి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు హౌరా చేరుకుంటుంది. ఈ రైలు ఖరగ్‌పూర్(Kharagpur), భద్రక్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా స్టేషన్‌లలో ఆగుతుంది.