ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి మత రంగు పులుముతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ వదంతులు వ్యాప్తి చెందుతుండడంతో.. ఈ వందతులను వ్యాప్తి చేసే వ్యక్తులను వదిలే ప్రసక్తి లేదని ఒడిశా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఒడిశా(Odisha)లోని బాలాసోర్(Balasore) జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి(Train Accident) మత రంగు పులుముతూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) పోస్టులు పెడుతున్నారు. ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ వదంతులు వ్యాప్తి చెందుతుండడంతో.. ఈ వందతులను వ్యాప్తి చేసే వ్యక్తులను వదిలే ప్రసక్తి లేదని ఒడిశా పోలీసులు వార్నింగ్(Warning) ఇచ్చారు. బాలాసోర్ రైలు ప్రమాదానికి మతం రంగు పులుముతూ వదంతులు వ్యాప్తి చేయొద్దని.. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతా(Twitter)లో పోలీసులు ఓ పోస్ట్ చేశారు. ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని చెప్పారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఓ వర్గం వారు కుట్ర పన్నారంటూ, ఆ తర్వాతే ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఒడిశా రైలు ప్రమాదానికి దారి తీసిన కారణాన్ని కనుగొన్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) తెలిపారు. రైలు ప్రమాదంపై విచారణ పూర్తయిందని, రైల్వే సేఫ్టీ కమిషనర్(Railway Safety Commissioner)కు నివేదిక అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ లో మార్పు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రైల్వే సిగ్నలింగ్ పాయింట్ లో ఎవరో మార్పులు చేశారని తెలిపారు. మెయిన్‌లైన్‌లోకి వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ ఇచ్చినప్పటికీ అది టేకాఫ్ కావడంతో రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.