క్రికెట్‌(Cricket) టోర్నీని ప్రారంభించినప్పుడు వచ్చిరాని బ్యాటింగ్‌ చేయడం, టెన్నిస్‌(tennis) టోర్నీ ఇనాగరేషన్‌కు వెళ్లినప్పుడు రాకెట్‌ పుచ్చుకుని కోర్టులో అటు ఇటు పరుగెత్తడం ... ఇలా ఏ ఆటల పోటీలకు వెళ్లినా తగుదునమ్మా అంటూ తమలోని స్పోర్ట్స్‌ పర్సన్‌ను పది మందికి చూపాలనుకుంటున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇట్టాగే ఒడిశాలో(Odisha) కూడా ఓ ఎమ్మెల్యే(MLA) క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు.

క్రికెట్‌(Cricket) టోర్నీని ప్రారంభించినప్పుడు వచ్చిరాని బ్యాటింగ్‌ చేయడం, టెన్నిస్‌(tennis) టోర్నీ ఇనాగరేషన్‌కు వెళ్లినప్పుడు రాకెట్‌ పుచ్చుకుని కోర్టులో అటు ఇటు పరుగెత్తడం ... ఇలా ఏ ఆటల పోటీలకు వెళ్లినా తగుదునమ్మా అంటూ తమలోని స్పోర్ట్స్‌ పర్సన్‌ను పది మందికి చూపాలనుకుంటున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇట్టాగే ఒడిశాలో(Odisha) కూడా ఓ ఎమ్మెల్యే(MLA) క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రారంభించారు. తనలోని బ్యాటర్‌ను అందరికీ చూపాలనుకున్నారు. బ్యాటింగ్‌ చేయబోయి బొక్కబోర్లాపడి గాయపడ్డాడు. గాయపడిన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. కలహండీ(Kalahandi) జిల్లాలో ఈ ఘటన జరగింది. నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్రసింగ్‌(Bhupendra Singh) ఓ క్రికెట్‌ ఓర్నీని మొదలుపెట్టాడు. అటు పిమ్మట బ్యాటు పుచ్చుకుని క్రీస్‌లోకి వచ్చాడు. ఓ యువకుడు విసిరిన బంతిని బౌండరీ దాటించాలనుకున్నాడు. భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించి అదుపుతప్పి నేలపై పడ్డాడు. తల, ముఖం, చేతులకు గాయలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పొలిటిషియన్లు పాలిటిక్స్‌కే పరిమితం అవుతే బాగుంటుందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 29 Dec 2023 6:59 AM GMT
Ehatv

Ehatv

Next Story