ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnayak) మంత్రి వ‌ర్గంలో ముగ్గురు కొత్త మంత్రులు చేరారు. సోమవారం లోక్‌సేవా భవన్‌లో(Lok seva bhavan) గవర్నర్‌ గణేశిలాల్(Ganeshilal) నూత‌న మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్(Naveen Patnayak) మంత్రి వ‌ర్గంలో ముగ్గురు కొత్త మంత్రులు చేరారు. సోమవారం లోక్‌సేవా భవన్‌లో(Lok seva bhavan) గవర్నర్‌ గణేశిలాల్(Ganeshilal) నూత‌న మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు బిక్రమ్ కేశరి అరుఖా(bikram keshari aruku), శారదా నాయక్(Sharadha Nayak), సుదామ్ మార్ండి(Sudam Marndi) మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. బిక్రమ్ కేశరి అరుఖాకు ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో కేటాయించారు. విద్యా శాఖ సుదామ్ మార్ండి కి, కార్మిక‌ శాఖ‌ శారదా నాయక్‌లకు కేటాయించారు.

ముగ్గురు మంత్రుల చేరికతో ఒడిశా మంత్రి మండలిలో మంత్రుల సంఖ్య 22కి పెరిగింది. బిక్రమ్ కేశరి అరుఖా భంజానగర్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా.. సుదామ్ మార్ండి, శారదా నాయక్ లు బంగ్రిపోసి, రూర్కెలా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి శాస‌న‌స‌భ్యులుగా ఎన్నిక‌య్యారు. గత వారం విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాష్, కార్మిక మంత్రి శ్రీకాంత్ సాహు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోగ్య శాఖ‌ మంత్రి నబా దాష్ హత్య తర్వాత.. ఆ పదవి కూడా ఖాళీగా ఉంది. ఒడిశా శాసనసభ స్పీకర్ పదవిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated On 22 May 2023 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story