రాజకీయాలకు గ్లామర్‌ తీసుకొస్తున్నారు కొంతమంది నటీనటులు! సినిమాల్లో నటించి అలిసిపోయినవారికి ఇప్పుడు రాజకీయాలే కదా పెద్ద దిక్కు! కొందరు మాత్రం సినిమా కెరీర్‌ను త్యాగం చేసి మరీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. ఒడిశాలో కూడా బిజూ జనతాదళ్‌ (BJD) పార్టీకి సినీ గ్లామర్‌ తోడయ్యింది.

రాజకీయాలకు గ్లామర్‌ తీసుకొస్తున్నారు కొంతమంది నటీనటులు! సినిమాల్లో నటించి అలిసిపోయినవారికి ఇప్పుడు రాజకీయాలే కదా పెద్ద దిక్కు! కొందరు మాత్రం సినిమా కెరీర్‌ను త్యాగం చేసి మరీ పాలిటిక్స్‌లోకి వస్తున్నారు. ఒడిశాలో కూడా బిజూ జనతాదళ్‌ (BJD) పార్టీకి సినీ గ్లామర్‌ తోడయ్యింది. ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమత్రి నవీన్‌ పట్నాయక్‌ తొమ్మిది మందితో కూడిన ఓ జాబితాను ప్రకటించారు. ఇందులో ఒడిశా ప్రముఖ నటి వర్ష ప్రియదర్శిని(Varsha priya dharsini) పేరు కూడా ఉంది. చిత్రమేమిటంటే ఆమె రెండు రోజుల కిందటే బీజేడీలో చేరింది. ఆమె జాజ్‌పూర్‌ జిల్లాలోని బర్చానా అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్నది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అమరప్రసాద్‌ సత్పతిని కాదని ఆమెకు వర్ష ప్రియదర్శినికి టికెట్‌ ఇచ్చారు. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ 135 మంద అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే లోక్‌సభకు 21 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Updated On 20 April 2024 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story