దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్యం(Air Pollution) వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెడ్ లైట్ ఆన్..
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)ని వాయు కాలుష్యం(Air Pollution) వదలడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. దీంతో పాటు మరోసారి సరి-బేసి ఫార్ములాను అమలు చేయబోతున్నది. దీపావళి పండుగ(Diwali Festival) తర్వాత ఢిల్లీలో సరి-బేసి ఫార్ములా అమలుకానుంది. ఈ ఫార్ములా ప్రకారం చివర బేసి సంఖ్య ఉన్న అంటే 3,5,7,9 నంబర్లు ఉన్న వాహనాలు మాత్రమే బేసి సంఖ్యగల తేదీలో రోడ్డు మీదకు వస్తాయి. సరి సంఖ్య ఉన్న వాహనాలు, అంటే చివరన 2,4,6,8 నంబర్లు ఉన్న వాహనాలు సరిసంఖ్య గల తేదీలలోనే రోడ్డు మీదకు రావడానికి అనుమతి ఉంటుంది. దీనివల్ల రోడ్డు మీద వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ఇంతకు ముందు 2016లో కూడా కేజ్రీవాల్ సర్కార్ ఈ విధానాన్ని అమలు చేసింది. అసలు ఈ ఫార్ములాను మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన దేశం మెక్సికో! దీనికి హోయ్ నో సర్కులా అనే పేరు పెట్టారు. దీని అర్థమేమిటంటే మీ కారు ఈ రోజు నడవదు అని! తర్వాతతర్వాత చాలా దేశాలు ఇలాంటి విధానాలను అమలు చేశాయి. బీజింగ్, బ్రెజిల్, కొలంబియా, పారిస్ వంటి మహానగరాలలో సరి-బేసి విధానానికి సంబంధించిన నిబంధనలు అమలు అయ్యాయి. ప్రతి ఏడాది శీతాకాలంలో అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల చిట్టాలో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉంది.