లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది
లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు అభ్యర్థులు మార్చి 27 వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. నామినేషన్ పత్రాల పరిశీలన మార్చి 28న జరుగుతుంది. మార్చి 30 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. బీహార్‌లో హోలీ కారణంగా మార్చి 28 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.
తొలి దశలో తమిళనాడులో అత్యధికంగా 39 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాజస్థాన్ లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో 5, బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్ లో 3, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లలో 2 చొప్పున స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అండమాన్-నికోబార్, జమ్మూ-కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, త్రిపురలలో కూడా ఒక్కో సీటుకు ఎన్నికలు జరుగుతాయి.