దేశంలో ఈశాన్య ఋతుపవనాల(Monsoons) ఆగమనం ప్రారంభమైంది. సముద్రం వైపు నుంచి ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతంతో పాటు కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలులు బలపడి విస్తరిస్తున్నాయి.

దేశంలో ఈశాన్య ఋతుపవనాల(Monsoons) ఆగమనం ప్రారంభమైంది. సముద్రం వైపు నుంచి ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతంతో పాటు కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలులు బలపడి విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే వీటి ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్పష్టంగా

అల్పపీడనం..
మరోవైపు ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఈ ఉదయం అల్పపీడన ప్రాంతంగా మారి ఆగ్నేయ, ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావం ఏపీపై అంత ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాగల మూడు రోజుల పాటు కొన్నిచోట్ల చెదురుమదురు వర్షాలే ఉంటాయని అంచనా. ఇదే విషయాన్ని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం కూడా ప్రకటించింది. అయితే ఏపీపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం పడేందుకు ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి.

రాబోయే 5 రోజుల వాతావరణ హెచ్చరికలు:
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షపాతంతో దక్షిణ భారతదేశంలోని చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 21-25 మధ్య కేరళలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. అక్టోబర్ 21, 22 తేదీల్లో తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది

అరేబియా మహాసముద్రంలో ‘తేజ్’ తుఫాను..
భారతదేశానికి పశ్చిమ వైపు ఉన్న అరేబియా మహాసముద్రంలో తుఫాను కొనసాగుతోంది. దీనికి తేజ్‌గా నామకరణం చేశారు. ఇది నైరుతి అరేబియా సముద్రం మీదుగా తీవ్ర తుఫానుగా మారింది. గత 6 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి.. తీవ్ర తుఫానుగా మారింది. సోకోత్రా(యెమెన్)కి తూర్పు-ఆగ్నేయంగా 550 కిలోమీటర్లు, సలాలా (ఒమన్)కి 880 కిలోమీటర్ల దక్షిణ-ఆగ్నేయంగా, అల్ గైదా(యెమెన్)కి ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది 22వ తేదీ ఉదయం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా, ఆ తర్వాత 24వ తేదీ ఉదయం వరకు వాయువ్య దిశగా.. ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 25 తెల్లవారు జామున అల్ గైదా(యెమెన్) – సలాలా(ఒమన్) మధ్య యెమెన్-ఒమన్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Updated On 22 Oct 2023 1:15 AM GMT
Ehatv

Ehatv

Next Story