ఉత్తరప్రదేశ్‌లోని అమేథి (Amethi), రాయబరేలీ (Rai Bareli) లోక్‌సభ నియోజకవర్గాలు కాంగ్రెస్‌పార్టీ కంచుకోటలు. అక్కడ్నుంచి వారు తప్ప ఇంకెవ్వరూ గెలవలేరు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేసిన తరుణంలో 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి మల్హోత్రా ఇరానీ అక్కడ విజయం సాధించి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. ఇంతకు ముందు 1998లో బీజేపీనే గెలుపొందారు. ఈసారి కూడా రాహుల్‌గాంధీ అక్కడ్నుంచి పోటీ చేస్తారని అనుకుంటే ఆయన మాత్రం అమేథిని వదిలిపెట్టి రాయబరేలీని ఎంచుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథి (Amethi), రాయబరేలీ (Rai Bareli) లోక్‌సభ నియోజకవర్గాలు కాంగ్రెస్‌పార్టీ కంచుకోటలు. అక్కడ్నుంచి వారు తప్ప ఇంకెవ్వరూ గెలవలేరు అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేసిన తరుణంలో 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి మల్హోత్రా ఇరానీ అక్కడ విజయం సాధించి అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. ఇంతకు ముందు 1998లో బీజేపీనే గెలుపొందారు. ఈసారి కూడా రాహుల్‌గాంధీ అక్కడ్నుంచి పోటీ చేస్తారని అనుకుంటే ఆయన మాత్రం అమేథిని వదిలిపెట్టి రాయబరేలీని ఎంచుకున్నారు. అమేథి కంటే రాయబరేలీనే సురక్షితం అని రాహుల్ భావించి ఉంటారు. రాయబరేలీ నుంచి రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ (Indira Gandhi) మూడు సార్లు విజయం సాధించారు. 1967, 1971, 1980లో గెలిచిన ఆమె 1977లో మాత్రం జనతాపార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్‌ చేతిలో ఓడిపోయారు. కానీ తన తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi) మాత్రం అక్కడ్నుంచి పోటీ చేసిన ప్రతీసారి విజయాన్నే అందుకున్నారు. ఈ కారణంగానే రాహుల్‌ (Rahul Gandhi) అమేథిని కాదని రాయబరేలీకి షిఫ్ట్‌ అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా గాంధీ కుటుంబసభ్యులే అమేథికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 26 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత అక్కడ గాంధీయేతరలకు కాంగ్రెస్‌ అవకాశం కల్పించింది. 1980లో తొలిసారి అమేథి స్థానాన్ని గాంధీ కుటుంబం గెలుచుకుంది. సంజయ్‌ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 1980 జూన్‌లో ఆయన విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సంజయ్‌ గాంధీ (Sanjay gandhi) సోదరుడు రాజీవ్‌ గాంధీ (Rajeev gandhi) పోటీ చేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి 1991 వరకూ ఆ స్థానంలో రాజీవ్‌ గాంధీ కొనసాగారు. 1991లో ఆయన మరణించిన తర్వాత అమేథి స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ సతీశ్‌ శర్మను (Satheesh Sharma) బరిలోకి దింపింది. ఆయన కూడా విజయం సాధించారు. 1996లో జరిగిన ఎన్నికల్లోనూ సతీశ్‌ శర్మే గెలుపొందారు. అయితే, 1998లో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత 1999లో సోనియా గాంధీ అమేథి నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో అమేథి స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీని అమేథి నుంచి తొలిసారి బరిలోకి దింపింది.అప్పటి నుంచి 2009, 2014 వరకూ రాహుల్‌ ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా అమేథి నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తుందని అనుకున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా పేర్లు కూడా వినిపించాయి. అమేథి నుంచి రాహుల్‌ లేదా ప్రియాంక, రాబర్ట్‌ వాద్రా ఎవరో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో కిశోరీ లాల్‌ శర్మ (Kishori Lal Sharma) తెరమీదకు వచ్చారు.

Updated On 4 May 2024 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story