దేశ రాజధాని డిల్లీ(Delhi) శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని(Utar Pradesh) నోయిడాలో(Noida) దీపక్ టెంగూరియా(Deepak Tenguriya) అనే వ్యక్తి ఉంటాడు. మొన్న శుక్రవారం ఉదయం ఉబర్(Uber) యాప్ ద్వారా ఓ ఆటో బుక్ చేసుకున్నాడు. తను చేరాల్సిన ప్రాంతానికి 62 రూపాయలు చెల్లించాని వచ్చింది. సాధారణంగా తన గమ్యానికి అంతే అవుతుంది. అందుకే ఆటో ఎక్కి కూర్చుకున్నాడు. సగం దూరం వెళ్లిన తర్వాత ఏమనిపించిందో ఏమో కానీ ఉబర్ యాప్‌ను మరోసారి చెక్ చేశాడు దీపక్ టెంగూరియా! అందులో 7.66 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా వచ్చింది
దేశ రాజధాని డిల్లీ(Delhi) శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని(Utar Pradesh) నోయిడాలో(Noida) దీపక్ టెంగూరియా(Deepak Tenguriya) అనే వ్యక్తి ఉంటాడు. మొన్న శుక్రవారం ఉదయం ఉబర్(Uber) యాప్ ద్వారా ఓ ఆటో బుక్ చేసుకున్నాడు. తను చేరాల్సిన ప్రాంతానికి 62 రూపాయలు చెల్లించాని వచ్చింది. సాధారణంగా తన గమ్యానికి అంతే అవుతుంది. అందుకే ఆటో ఎక్కి కూర్చుకున్నాడు. సగం దూరం వెళ్లిన తర్వాత ఏమనిపించిందో ఏమో కానీ ఉబర్ యాప్‌ను మరోసారి చెక్ చేశాడు దీపక్ టెంగూరియా! అందులో 7.66 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా వచ్చింది. అది చూసి మనోడికి గుండె జారిపోయింది. ట్రిప్ ఫేర్‌గా 1,67,74,647 రూపాయలను ఛార్జ్ చేసింది ఉబర్. దాంతో పాటు వెయిటింగ్ కోసం 5,99,09,189 రూపాయలు చెల్లించాలని, ప్రమోషన్ కాస్ట్ 75 రూపాయలతో కలిసి మొత్తం 7,66 ,83,762 రూపాయలు చెల్లించాలని ఉబయ్ యాప్‌లో కనిపించడంతో షాక్ అయ్యాడు. నయం..ఇంకా జీఎస్టీ వేయలేదు అని అనుకున్నవాడై మధ్యలోనే ఆటో దిగేసి హమ్మయ్య అని అనుకున్నాడు. దీపక్ ఫ్రెండ్ ఆశీష్ మిశ్రా ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. దాంతో పాటుగా ఉబర్ యాప్‌లో 7,66 ,83,762 రూపాయలు చెల్లించాలంటూ చూపించిన స్కీన్ షాట్‌ను వీడియో తీసి పోస్ట్ చేశాడు. చంద్రమండలం మీదకు వెళ్లి రావడానికి కూడా ఇంత ధర ఉండదేమోనని కామెంట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఉబర్‌పై నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు ఈ వీడియోను ఉబర్ సంస్థకు షేర్ చేశారు. ఈ ఘటనపై ఉబర్ ఇండియా సంస్థ రియాక్టయ్యింది. ప్రయాణికుడికి కలిగిన ఇబ్బందికి సారీ చెప్పింది. ఈ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పింది.