కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. సీఎం పదవిపై పోరు కొనసాగుతోంది. సిద్ధరామయ్యకు సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయిన ఎంబీ పాటిల్ చేసిన ప్రకటన రాజకీయ వేడిని పెంచింది. సిద్ధరామయ్య ఐదేళ్లపాటు సీఎంగా ఉంటారని ఎంబీ పాటిల్ అన్నారు. మైసూర్‌లో విలేకరులతో మాట్లాడిన పాటిల్.. సీఎం పదవిపై సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని పేర్కొన్నారు.

No power sharing formula between Siddaramaiah, DK Shivakumar Karnataka minister MB Patil
కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. సీఎం(Cheif Minister) పదవిపై పోరు కొనసాగుతోంది. సిద్ధరామయ్య(Siddaramaiah)కు సన్నిహితుడు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయిన ఎంబీ పాటిల్(MB Patil) చేసిన ప్రకటన రాజకీయ వేడి(Political Heat)ని పెంచింది. సిద్ధరామయ్య ఐదేళ్లపాటు సీఎంగా ఉంటారని ఎంబీ పాటిల్ అన్నారు. మైసూర్(Mysore)లో విలేకరులతో మాట్లాడిన పాటిల్.. సీఎం పదవిపై సిద్ధరామయ్య, శివకుమార్(DK Shiva Kumar) మధ్య ఎలాంటి ఒప్పందం లేదని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల తర్వాత లేదా 2024 లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) తర్వాత శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంపై వచ్చిన ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. అలాంటిది జరగాల్సి ఉంటే.. పార్టీ హైకమాండ్(High Command) కచ్చితంగా తెలియజేసి ఉండేదన్నారు.
ఎంబీ పాటిల్ ప్రకటనపై డీకే బ్రదర్స్ డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్(DK Suresh) ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు, మాట్లాడనివ్వండి అని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, వారు చూస్తారని వ్యాఖ్యానించారు.
ఎంబీ పాటిల్ వ్యాఖ్యలపై శివకుమార్ సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పాటిల్ ప్రకటనకు సమాధానం కావాలంటే పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలాను కలవవచ్చని.. ఈ విషయంలో ఆయన మరింత మెరుగ్గా వివరణ ఇవ్వగలరని అన్నారు. నేను కూడా చాలా మాట్లాడగలను.. కానీ ప్రస్తుతం మాట్లాడటానికి ఏమీ లేదని సురేష్ అన్నారు.
