కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉద‌యం ప్రారంభ‌మైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, జేడీఎస్‌లు పోటాపోటీగా ప్ర‌చారం చేశాయి. ఫలితాల కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఫ‌లితాల‌లో కాంగ్రెస్ ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అంచ‌నాలు త‌ల‌కిందులైన‌ట్టు తెలుస్తోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్(Karnataka Election Counting) ఉద‌యం ప్రారంభ‌మైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌(Congress)తో పాటు బీజేపీ(BJP), జేడీఎస్‌(JDS)లు పోటాపోటీగా ప్ర‌చారం చేశాయి. ఫలితాల కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఫ‌లితాల‌లో కాంగ్రెస్ ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) అంచ‌నాలు త‌ల‌కిందులైన‌ట్టు తెలుస్తోంది. నా షరతును ఏ పార్టీ అంగీకరిస్తే ఆ పార్టీకే మద్దతిస్తామని కుమారస్వామి నిన్న మొన్నటి వరకు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి తనను సీఎం చేయాలన్నదే తన షరతు అని కుమారస్వామి చెప్పారు. అయితే, ఇప్పుడు కుమారస్వామి తన వాదనపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా.. నాకు ఎలాంటి డిమాండ్(Demand) లేదని కుమారస్వామి అన్నారు.

మరో 2-3 గంటల్లో అంతా తేలిపోతుందని కుమారస్వామి అన్నారు. రెండు జాతీయ పార్టీలు(National Parties) భారీ స్కోరు సాధిస్తాయని ఎగ్జిట్(Exit Polls) పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌(JDS)కు 30-32 సీట్లు వస్తాయి. మాది చిన్న పార్టీ, నాకు ఎలాంటి డిమాండ్లు లేవు.. మంచి అభివృద్ధిని ఆశిస్తున్నాను. తనను ఎవరూ సంప్రదించలేదని కూడా కుమారస్వామి చెప్పారు.

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) బీజేపీ గెలుపు ఖాయమన్నారు. బొమ్మై మాట్లాడుతూ.. ఈ రోజు కర్ణాటకకు గొప్ప రోజు, రాష్ట్రానికి ప్రజల తీర్పు రాబోతోంది. బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిచి సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.

Updated On 12 May 2023 10:39 PM GMT
Yagnik

Yagnik

Next Story