బీహార్‌లోని పాట్నాలో జూన్ 12న జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కి వాయిదా పడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరుగనున్న సమావేశం వాయిదా వేయడానికి వెల్లడించారు. జూన్ 12న జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అధినేత రాహుల్ గాంధీ హాజరు కావడం లేదని గతంలోనే పార్టీ నేతలు స్పష్టత ఇచ్చారు.

Nitish Kumar’s mega Oppn meet in Patna postponed to June 23
బీహార్(Bihar)లోని పాట్నా(Patna)లో జూన్ 12న జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కి వాయిదా పడింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) అధ్యక్షతన జరుగనున్న సమావేశం వాయిదా వేయడానికి వెల్లడించారు. జూన్ 12న జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge), పార్టీ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరు కావడం లేదని గతంలోనే పార్టీ నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ(Congress) కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేష్(Jairam Ramesh) మాట్లాడుతూ.. పార్టీ ప్రతినిధి ఒకరు హాజరవుతారని పేర్కొన్నారు. కాకపోతే.. సమావేశ తేదీని ముందుగానే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది.
విపక్షాల ఐక్యతను బలోపేతం చేసేందుకు నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్(West Bangal), ఉత్తరప్రదేశ్(Utterpradesh), మహారాష్ట్ర(Maharastra), ఒడిశా(Odisha), కర్ణాటక(Karnataka)తో సహా అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. ఏప్రిల్ 12న నితీష్ తొలిసారిగా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీని ప్రతిపక్షాల ఐక్యతకు చారిత్రాత్మక అడుగుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal), సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benarjee)తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(Navin Patnaik) తదితరులను కూడా నితీశ్ కలిశారు. మే నెలలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren), ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar), సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను నితీశ్ సంప్రదించారు.
