బీహార్‌లో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే వారం నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్, బీహార్ కాంగ్రెస్ ఇంచార్జ్ భక్త చరణ్ దాస్ శనివారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ కానున్నారు.
బీహార్(Bihar)లో రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ(Cabinet Expansion)పై చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే వారం నితీష్ కుమార్(Nitish Kumar) మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ ప్రసాద్ సింగ్(Congress Chief Akhilesh Prasad Singh), బీహార్ కాంగ్రెస్ ఇంచార్జ్ భక్త చరణ్ దాస్(AICC Incharge Bhaktha Charan Das) శనివారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ కానున్నారు. జేడీయూ(JDU) కోటా నుంచి ఒకరు, ఆర్జేడీ(RJD) నుంచి ఒకరు, కాంగ్రెస్(Congress) కోటా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆర్జేడీ కోటా నుంచి ఔరంగాబాద్ ఎమ్మెల్యేతో పాటు అగ్రవర్ణాల నుంచి వచ్చిన ఓ సీనియర్ నాయకుడి కుమారుడికి మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. జేడీయూ కోటా నుంచి ఓ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కవచ్చు. మరోవైపు ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లపై ఆ పార్టీ మేధోమథనం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలలో ఎవరికైనా మంత్రిపదవి దక్కొచ్చు. ముఖ్యంగా మహరాజ్‌గంజ్ ఎమ్మెల్యే విజయ్ శంకర్ దూబే(Vijay Shankar Dubey), ఔరంగాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ శంకర్(Anand Shankar), ముజఫర్‌పూర్ నుంచి పార్టీ టికెట్‌పై గెలిచిన విజయేందర్ చౌదరి(Vijayendar Choudhary) పేర్లు వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే.. జులై 13న అసెంబ్లీ మార్చ్‌లో విజయ్‌సింగ్(Vijay Singh) మృతి, కార్మికుల వేధింపులపై మహాకూటమి ప్రభుత్వంపై సుదీర్ఘ పోరాటానికి బీజేపీ(BJP) సన్నాహాలు చేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి(Samrat Choudhary) ఈ విషయాన్ని వెల్లడించారు. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు బీజేపీ సంతకాల క్యాంపెయిన్ నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాలు, బ్లాక్‌లలో బీజేపీ యువమోర్చా(BJP Yuva Morcha) కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి ప్రజల నుంచి సంతకాలు తీసుకుంటారు. అనంతరం గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.