హిందూమత సర్వోన్నత పెద్దగా స్వయంగా ప్రకటించుకున్న నిత్యానంద(Nityananda).. అయోధ్యలో(Ayodhya) జరిగే రామమందిర(Ram mandir) కార్యక్రమానికి ఆహ్వానం అందిందన్నారు.
హిందూమత సర్వోన్నత పెద్దగా స్వయంగా ప్రకటించుకున్న నిత్యానంద(Nityananda).. అయోధ్యలో(Ayodhya) జరిగే రామమందిర(Ram mandir) కార్యక్రమానికి ఆహ్వానం అందిందన్నారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ట్విట్టర్‌లో(Twitter) ప్రకటించారు. ‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను చూడకుండా ఉండకండని ఆయన అన్నారు. సాంప్రదాయ ప్రాణ ప్రతిష్ట సమయంలో రాముడు లాంఛనంగా ఆలయంలోని ప్రధాన విగ్రహంలోకి ఆవాహన అవుతాడు. యావత్ ప్రపంచాన్ని కరుణించేందుకు భూమిపైకి వస్తాడు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘లాంఛనంగా ఆహ్వానం అందడంతో హిందూ మతం అత్యున్నత పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం మహోన్నత కార్యక్రమానికి హాజరుకానున్నారు’ అని అందులో పేర్కొన్నారు.
కర్నాటకలో(Karntaka) ఓ మఠానికి అధిపతిగా ఉన్న సమయంలో నిత్యానందపై 2010లో అత్యాచారం కేసు నమోదైంది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం నుంచి పారిపోయాడు. ఒక దీవిని ‘కైలాస’ దేశంగా ప్రకటించిన ఆయన హిందూ మతానికి సర్వోన్నత పీఠాధిపతిగా చెప్పుకుంటున్నాడు. నటి రంజితతో రాసలీలాడుతున్నట్లు వచ్చిన వీడియోపై ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇలాంటి వివాదాస్పద స్వామిగా ఉన్న నిత్యానందకు ఆహ్వానం ఎలా పంపిచారని పలువురు హిందూమంత ప్రియులు ప్రశ్నిస్తున్నారు.