రిలయన్స్(Reliance) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh ambani)- నీతా అంబానీ(Nita ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకలు(Pre wedding event) మొన్నే ముగిశాయి. అందరూ అబ్బురపడేట్టుగా వేడుకలను నిర్వహించారు. ఇప్పుడు నీతా అంబానీకి కాసింత తీరిక దొరికింది. ఆమె గృహిణీ మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ఆమెకు డ్రస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది.
రిలయన్స్(Reliance) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh ambani)- నీతా అంబానీ(Nita ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) ప్రీ వెడ్డింగ్ వేడుకలు(Pre wedding event) మొన్నే ముగిశాయి. అందరూ అబ్బురపడేట్టుగా వేడుకలను నిర్వహించారు. ఇప్పుడు నీతా అంబానీకి కాసింత తీరిక దొరికింది. ఆమె గృహిణీ మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. ఆమెకు డ్రస్సింగ్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించేలా చేనేత చీరలను ధరిస్తారు. ఆమె కట్టుకున్న వాచ్, వాడే ఫోన్, వేసుకునే నగలు అన్నీ ప్రత్యేకమే. లేటెస్ట్‌గా ముంబాయిలో(Mumbai) జరిగిన ఓ వేడుకలో నీతా అంబానీ బనారస్ చీరలో(Banaras saree) ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె ధరించిన అరవంకి(Aravanki) అంటే బాజూబాంద్ అందరినీ ఆకట్టుకుంది. దాని ఖరీదు ఎంత ఉంటుందోనని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మార్చి 9వ తేదీన ముంబాయిలో జరిగిన 71వ మిస్ వరల్డ్(71 Miss world) కార్యక్రమంలో ఈమె కూడా అవార్డు అందుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ చేసిన వితరణలకు, సేవలకు గాను బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్(Beauty with Purpose Humanitarian) అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మ్‌పై పెట్టుకున్న ఆభరణం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మొఘల్ చక్రవర్తి(Mughal emperor) షాజహాన్(Shah Jahan) తలపాగాపై ధరించే సర్‌పేచ్‌ను అందంగా తీర్చిదిద్ది ధరించారు నీతా. ఈ అభరణం ధర సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ఆభరణాన్ని 13.7 సెంటిమీర్ల ఎత్తు, 19.8 సెంటిమీటర్ల వెడలప్పుతో మేలిమి బంగారంతో తయారుచేశారు. దీనికి వజ్రాలు, కెంపులు, ఇతర విలువైన రాళ్లను పొదిగారు.