ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్(Viren Merchant) కూతురు రాధిక మర్చంట్‌ల(Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కళ్లు చెదిరేలా జరిగాయి.

Neeti Ambani
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్(Viren Merchant) కూతురు రాధిక మర్చంట్‌ల(Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కళ్లు చెదిరేలా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖలంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. సినీ రంగానికి చెందినవారు ఆటపాటలతో అలరించారు. ఇక ఈ వేడుకల్లో ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ(Neeti Ambani) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సంప్రదాయ నృత్యాలతో అతిథులను అలరించారు. ఆమె ధరించిన పచ్చలు పొదిగిన, పొడవాటి నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె వేసుకున్న ఆ డైమండ్ నెక్లెస్ రేటు ఎంత ఉంటుందోనన్న క్యూరియాసిటీ పెరిగింది. ఆ నెక్లెస్ ధర 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని అంటున్నారు.
