ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం గురువారం నాడు జరిగింది. బెంగళూరులోని ఇంట్లో ఈ వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి తెరపైకి వచ్చింది. నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలో రాజకీయ ప్రముఖులు కనిపించలేదు.

Nirmala Sitharaman’s Daughter Gets Married In A Simple Home Ceremony
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కుమార్తె పరకాల వాంగ్మయి(Parakala Vangamayi) వివాహం గురువారం నాడు జరిగింది. బెంగళూరు(Banglore)లోని ఇంట్లో ఈ వివాహం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి తెరపైకి వచ్చింది. నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలో రాజకీయ ప్రముఖులు కనిపించలేదు. పరకాల వాంగ్మయి భర్త పేరు ప్రతీక్(Prateek). ఈ వివాహం బ్రాహ్మణ సంప్రదాయం(Brahmin tradition) ప్రకారం ఉడిపి ఆడమారు మఠం(Udupi Adamaru Mutt)లోని సాధువుల ఆశీస్సులతో జరిగింది.
నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహ వీడియోను చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా(Social Media)లో పంచుకున్నారు. వీడియోలో వేద మంత్రోచ్ఛారణలు వినిపిస్తున్నాయి. వేడుకలో నిర్మలా సీతారామన్ ఉన్నారు. కొంతమంది నెటిజన్లు ఇంత సాధారణంగా వివాహ వేడుక జరపడాన్ని ప్రశంసిస్తున్నారు.
పరకాల వాంగ్మయి వృత్తి రీత్యా మల్టీమీడియా జర్నలిస్ట్(Multimedia Journalist). ఆమె మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ నుండి జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ సైన్స్(Master Of Sciences) అభ్యసించింది. ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) నుంచి ఆంగ్ల సాహిత్యంలో బీఎం, ఎంఏ చేశారు. ఆమె లైవ్ మింట్(Livemint), ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్(The Voice Of Fashion), ది హిందూ(The Hindu) వంటి సంస్థలలో పనిచేసింది.
