లోన్‌యాప్‌లపై(Loan App) పార్లమెంట్‌లో(Parliament) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala sitaraman) లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య కాలంలో 2500 లోన్‌యాప్‌లను గూగుల్(Google) తన ప్లే స్టోర్(Play store) నుంచి తొలగించిందని పేర్కొన్నారు.
లోన్‌యాప్‌లపై(Loan App) పార్లమెంట్‌లో(Parliament) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala Sitharaman) లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జులై మధ్య కాలంలో 2500 లోన్‌యాప్‌లను గూగుల్(Google) తన ప్లే స్టోర్(Play store) నుంచి తొలగించిందని పేర్కొన్నారు. లోన్‌యాప్స్‌పై రిజర్వ్ బ్యాంక్(Reserve bank), ఇక నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉందని తెలిపారు. అయితే చట్టబద్ధంగా నడిచే లోన్ యాప్‌ల వివరాలను ప్రభుత్వానికి ఆర్‌బీఐ అందించిందని.. వాటి వివరాలను గూగుల్‌కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీశాఖ పంపిందని తెలిపారు. గూగుల్ కూడా తన విధివిధానాలను పటిష్టపరిచిందని పేర్కొన్నారు. అనుమతి ఉన్న యాప్‌లనే గూగుల్ తన ప్లేస్టోర్‌లో ఉంచుతుందన్నారు. కేంద్ర హోంశాఖ, సైబర్ నేరాల సమన్వయ కేంద్రం ఈ యాప్‌ల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వివరించారు.