యెమెన్‌లో(Yemen) మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ(Kerala) నర్సు(Nurse) ప్రాణాలను ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు మాత్రమే కాపాడగలరు. మరణశిక్షపై ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను(Appeal) యెమెన్‌ సుప్రీం కోర్టు(supreme Court) తిరస్కరించడంతో బతుకుమీద ఆమె ఆశలు సన్నగిల్లాయి. మరోవైపు తన కూతురును విడిపించడానికి యెమెన్‌ వెళ్లడానికి బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారం రోజుల లోపు నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది.

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నిమిషా ప్రియ(Nimisha Priya) అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను(Passport) తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్‌అబ్దో మహదీ(Talal Abdo Mahadhi) అనే వ్యక్తికి మత్తుమందు(chloroform) ఇచ్చి చంపినట్టు కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్ జైలులోనే మరణభయంతో బతుకీడుస్తున్నారు. యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా 2016 నుంచి భారతీయులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్‌ వెళ్లడానికి నిమిషా ప్రియ తల్లి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టును అశ్రయించారు. తలాల్‌అబ్దో మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి మాట్లాడేందుకు యెమన్‌కు వెళ్లానుకుంటున్నారు ప్రియ తల్లి. ఒకవేళ తలాల్‌ అబ్దో మహదీ కుటుంబసభ్యులు కనుక క్షమాభిక్ష పెడితే ప్రియ మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. తన కూతురును కాపాడేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ యెమెన్‌ వెళ్లాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనానికి తల్లి విన్నవించుకున్నారు. అందుకే తనకు యెమెన్‌ వెళ్లేందుకు ప్రయాణ నిషేధాన్ని సడలించవలసిందిగా వేడుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని ప్రియ తరఫు న్యాయవాది అంటున్నారు. మరోవైపు ప్రియ విడుదల కోసం సేవ్‌ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ అనే బృందం 2022లో హైకోర్టు తలుపుతట్టింది. ప్రియను రక్షించడానికి యెమెన్‌తో కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరపాలని పిటిషన్‌లో కోరింది. యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా 2014లో ప్రియ భర్త, కూతురు ఇండియాకు వచ్చేశారు. ప్రియ మాత్రం ఉద్యోగ నిమిత్తం అక్కడే ఉండిపోయారు. 2015లో తలాల్‌ అబ్దో మహదీ సాయంతో ఆమె అక్కడ ఓ క్లినిక్‌ను తెరిచారు. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రియను మహదీ మానసికంగా, శారీరకంగా వేధించేవాడట!పైగా ప్రియ పాస్‌పోర్టను లాక్కున్నాడట!అతడి వేధింపులను తట్టుకోలేక 2017, జులై 25వ తేదీన మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. అతడు మత్తులోకి జారుకోగానే తన పాస్‌పోర్ట్‌ తీసుకోవాలన్నది ప్రియ ప్లాన్‌.కానీ మెహదీ చనిపోయాడు. దాంతో భయపడిన ఆమె శవాన్ని మరొకరి సాయంతో డిస్పోజ్‌ చేశారు. నాలుగు రోజుల తర్వాత నేరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రియను, ఆమెకు సాయం చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Updated On 17 Nov 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story