గుజరాత్‌లో(Gujarat) అమానవీయHumiliation) సంఘటన చోటు చేసుకుంది. చేసిన పనికి జీతం(Salary) ఇమ్మని అడిగినందుకు ఓ దళిత యువకుడిపై యజమానులురాలు(Owner), ఆమె సోదరుడు, మరికొందరు కలసి అమానుషంగా ప్రవర్తించారు. అతడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అక్కడితో ఆగకుండా అతడి నోట్లో(Mouth) యజమానురాలి చెప్పులు(Chappal) బలవంతంగా పెట్టి క్షమాపణలు చెప్పించారు. మోర్బీలో(Morbi) బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విభూతి పటేల్‌(Vibhuthi Patel) అనే మహిళ నిర్వహిస్తున్న రాణిబా ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో(Raniba Industries Pvt Ltd) నెలకు 12 వేల రూపాయల జీతానికి చేరాడు నీలేశ్‌ దల్సనియా(Nilesh Dalsania).

గుజరాత్‌లో(Gujarat) అమానవీయHumiliation) సంఘటన చోటు చేసుకుంది. చేసిన పనికి జీతం(Salary) ఇమ్మని అడిగినందుకు ఓ దళిత యువకుడిపై యజమానులురాలు(Owner), ఆమె సోదరుడు, మరికొందరు కలసి అమానుషంగా ప్రవర్తించారు. అతడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అక్కడితో ఆగకుండా అతడి నోట్లో(Mouth) యజమానురాలి చెప్పులు(Chappal) బలవంతంగా పెట్టి క్షమాపణలు చెప్పించారు. మోర్బీలో(Morbi) బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మరుసటి రోజు వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విభూతి పటేల్‌(Vibhuthi Patel) అనే మహిళ నిర్వహిస్తున్న రాణిబా ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో(Raniba Industries Pvt Ltd) నెలకు 12 వేల రూపాయల జీతానికి చేరాడు నీలేశ్‌ దల్సనియా(Nilesh Dalsania). అక్టోబర్‌ నెల ప్రారంభంలో మార్కెటింగ్‌(Marketing) ఉద్యోగంలో చేరాడు. అదే నెల 18వ తేదీన చెప్పాపెట్టకుండా అతడిని ఉద్యోగంలోకి తొలగించారు. తనకు రావాల్సిన 16 రోజుల జీతం ఇవ్వాల్సిందిగా పలుమార్లు కోరాడు. అయితే విభూతి పటేల్‌ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఫలితం లేకపోవడంతో తన సోదరుడితో పాటు మరో వ్యక్తితో కలిసి పరిశ్రమ దగ్గరకు వెళ్లాడు నీలేశ్‌. జీతం గురించి విభూతి పటేల్‌ను అడిగాడు. ఆమెకు కోపం వచ్చింది. తన సోదరుడు ఓమ్‌ పటేల్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకుంది. తర్వాత మేనేజర్‌, మరో నలుగురు అక్కడికి వచ్చారు. వారంతా కలిసి నీలేశ్‌ దల్సనియాతో పాటు అతడితో వచ్చిన ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బెల్ట్‌తో కొట్టాడు. కాళ్లతో తన్నారు. విభూతి పటేల్‌ అయితే నీలేశ్‌ను చెంపదెబ్బలు కొట్టి మెడపట్టుకుని టెర్రస్‌పైకి ఈడ్చుకెళ్లింది. అతడి నోట్లో తన చెప్పు పెట్టి క్షమాపణ అడగాలని ఒత్తిడి తెచ్చింది. మరోసారి తన ఫ్యాక్టరీ పరిసరాలలో కనిపిస్తే చంపేస్తానని బెదిరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితురాలు విభూతి పటేల్‌తోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిపై మోర్బి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన నీలేశ్‌ ప్రస్తుతం మోర్బి సివిల్‌ దవాఖానలో(Civil Hospital) చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితులు ఎవరినీ ఇప్పటివరకు అరెస్ట్‌ చేయలేదని పోలీసులు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని గాలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Updated On 25 Nov 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story