సాధారణంగా భర్తను(Husband) భార్యలు(Wife) కోరికలు కోరడం సహజం. పెళ్లిరోజు, పుట్టిన రోజులు విలువైన బహుమతులు(Gifts), వేడుకలు జరపాలని భర్తను భార్య కోరడం కామన్. కానీ ఓ భార్య తన కోరికలు తీర్చలేదని ఏకంగా భర్తనే కొట్టి చంపింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని(Maharastra) పుణెలో(Pune) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నిఖిల్ ఖన్నా(Nikhil Khanna) (36) రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారం చేస్తుంటాడు. ఆరేళ్ల క్రితం రేణుకను(Renuka) ప్రేమించి నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. గత సెప్టెంబర్ 18న రేణుక పుట్టిన రోజును(Birthday) దుబాయ్‌లో(dubai) జరుపుకోవాలని కోరింది. కానీ భర్త నిఖిల్ దానికి నిరాకరించాడు. తర్వాత నవంబర్ 11న పెళ్లి వేడుకలనైనా(Wedding Anniversary) దుబాయ్‌లో జరుపుకుందామని కోరినా నెరవేర్చలేదని కోపం పెట్టుకుంది. పెళ్లీ రోజు కనీసం తనకు మంచి గిఫ్ట్ కూడా ఇవ్వలేదని ఆగ్రహించింది.
ఈ క్రమంలోనే డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలో జరిగే తమ బంధువు పుట్టిన రోజు వేడుకలకు వెళ్దామని భర్తకు చెప్పింది. ఆమె ప్రతిపాదన పట్ల నిఖిల్ నిర్లక్ష్యంగా ఉన్నాడని, ఏం చెప్పినా తన మాట వినడంలేదని ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. భర్తపై ఆగ్రహంతో మొఖం మీద పిడిగుద్దులు గుద్దింది. నిఖిల్ ముక్కుపై(Nose) బలమైన గాయాలు కావడం, ముక్కునుంచి రక్తం రావడమే కాకుండా.. దంతాలు(Teeth) కూడా రాలిపోయాయి. హుటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా నిఖిల్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. పెళ్లి నాటి నుంచి వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, తరుచూ గొడవపడేవారని పోలీసులు తెలిపారు.