జీవిత ఖైదు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది టి నసీర్, బెంగళూరు సెంట్రల్

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఏడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తోంది. ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు జైలు ఖైదీల‌ను ఉగ్ర‌వాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు నేపథ్యంలో.. ప్రిజ‌న్ రాడిక‌లైజేష‌న్ కేసులో ఎన్.ఐ.ఏ. త‌నిఖీలు చేప‌ట్టింది. క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు మ‌రో అయిదు రాష్ట్రాల్లోని 17 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయి.

జీవిత ఖైదు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది టి నసీర్, బెంగళూరు సెంట్రల్ జైలులో అనేక మంది వ్యక్తులను సమూలంగా తీవ్రవాదం వైపు మార్చాడని.. దేశంలో ఉగ్రదాడులకు ప్రేరేపించాడని ఆరోపణలు వచ్చాయి. జూలై 2023లో 4 వాకీటాకీలతో పాటు 7 పిస్టల్స్, 4 హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఒక మ్యాగజైన్, 45 లైవ్ రౌండ్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న తరువాత బెంగళూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. NIA దీనికి సంబంధించి 25 అక్టోబర్ 2023న విచారణను చేపట్టింది. 13 డిసెంబర్ 2023న ఈ కేసులో కొన్ని దాడులు నిర్వహించింది. ఈ కేసులో NIA తాజా దాడులకు సంబంధించి బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనేది స్పష్టంగా తెలియలేదు. రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది.

Updated On 5 March 2024 12:30 AM GMT
Yagnik

Yagnik

Next Story