గ్రేటర్ నోయిడా(Greater Noida)లోని ఓ గ్రామంలో చిత్రమైన సంఘటన జరిగింది. పెళ్లయిన మరుసటి రోజునే పెళ్లికూతురు ఓ ఆడబిడ్డకు జన్మనించింది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు ప్రసవం కావడంతో షాకయ్యాడు పాపం ఆ కొత్త పెళ్లికొడుకు. అసలేం జరిగిందంటే మొన్న జూన్ 26వ తేదీన సోమవారం రోజున బ్రహ్మండంగా పెళ్లి జరిపించారు పెద్దలు. ఆ రోజు రాత్రి కడుపునొస్తున్నదంటూ నవ వధువు చెప్పింది.
గ్రేటర్ నోయిడా(Greater Noida)లోని ఓ గ్రామంలో చిత్రమైన సంఘటన జరిగింది. పెళ్లయిన మరుసటి రోజునే పెళ్లికూతురు ఓ ఆడబిడ్డకు జన్మనించింది. వివాహం జరిగి 24 గంటలైనా కాకుండానే తన భార్యకు ప్రసవం కావడంతో షాకయ్యాడు పాపం ఆ కొత్త పెళ్లికొడుకు. అసలేం జరిగిందంటే మొన్న జూన్ 26వ తేదీన సోమవారం రోజున బ్రహ్మండంగా పెళ్లి జరిపించారు పెద్దలు. ఆ రోజు రాత్రి కడుపునొస్తున్నదంటూ నవ వధువు చెప్పింది. ఎందుకైనా మంచిదని ఆమెను దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమెకు అన్ని పరీక్షలు చేశారు. చివరికి ఆమె ఏడు నెలల గర్భవతి అని తేలింది. వెంటనే ఆమెకు డెలివరీ కూడా చేశారు. ఆడ శిశువుకు జన్మనించిందా వధువు. ఇది చూసి భర్తతో పాటు అత్తమామలు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఈ విషయంలో వధువు తల్లిదండ్రులను నిలదీస్తే గతంలో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చికిత్స చేయించాము కానీ అమ్మాయి గర్భవతి అన్న సంగతి తమకు కూడా తెలియదని అన్నారు. కడుపువాపు వస్తుండటంతో ట్రీట్‌మెంట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అనుకున్నామే తప్ప గర్భవతని అనుకోలేదని చెబుతున్నారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిందన్న విషయం తెలిసి కూడా పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆమెను తనకు అంటగట్టారని పెళ్లికొడుకు ఫైరయ్యాడు. ఆమెను కానీ, ఆమె బిడ్డను కానీ తమ ఇంటికి రానిచ్చేది లేదని పెళ్లికొడుకు తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. బంధువులు, సన్నిహితులు కల్పించుకుని సమస్యను సద్దుమణిగేలా చేశారు.