ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఏ)లో భాగస్వాములకు మంత్రి వర్గంలో అవకాశం ఇస్తూ.. రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే కూటమి ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కొత్త (కేంద్ర) ప్రభుత్వానికి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీవితకాలం ఉంటుంది. ఇది ఇంతకంటే ఎక్కువ కాలం ఉండదని అన్నారు. గతంలో ఒక ఎన్‌డిఏ ప్రభుత్వం కేవలం 13 రోజులు కొనసాగింది.. మరొకటి 13 నెలల్లోనే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం భవిష్యత్తు కూడా ఇదేనని అన్నారు.