ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఏ అవార్డులను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు స్వీకరించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో పురస్కారాలను తీసుకునేందుకు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది.

New Guidelines For Bureaucrats On Awards From Private Organisations
ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఏ అవార్డులను(Awards) ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్ఎస్(IFS) అధికారులు స్వీకరించొద్దని కేంద్రం స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో పురస్కారాలను తీసుకునేందుకు సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపింది. ఒక వేళ అవార్డు స్వీకరిస్తే.. అందులో నగదు(Money) ఉండరాదనే షరతు విధించింది. అలాగే.. అవార్డులు ఇచ్చే సంస్థకు క్లీన్‌చిట్(Clean Chit) ఉండాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు (Cheif Secretaries) ఆదేశాలు ఇచ్చింది.
