చట్ట విరుద్ధమైన ఆన్లైన్ గేమింగ్(online gaming) ,బెట్టింగ్ యాప్(betting app) ల మోసాల వలన ఎంతో మంది యువత చెడు దారి పడుతున్నారు .కొంతమంది డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి . ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమ్‌ల కోసం తమిళనాడు ప్రభుత్వం(Tamilnadu government) కొత్త నిబంధనను రూపొందించింది. దీని ప్రకారం, ఇప్పుడు దేశంలో లేదా విదేశీ గేమ్ లను రూపొందించే కంపెనీలు తమను తాము ఆన్‌లైన్ గేమింగ్ కమిషన్‌లో(Online Gaming Commission) నమోదు చేసుకోవాలి అంటూ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది .
చట్ట విరుద్ధమైన ఆన్లైన్ గేమింగ్(online gaming) ,బెట్టింగ్ యాప్(betting app) ల మోసాల వలన ఎంతో మంది యువత చెడు దారి పడుతున్నారు .కొంతమంది డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి . ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమ్‌ల కోసం తమిళనాడు ప్రభుత్వం(Tamilnadu government) కొత్త నిబంధనను రూపొందించింది. దీని ప్రకారం, ఇప్పుడు దేశంలో లేదా విదేశీ గేమ్ లను రూపొందించే కంపెనీలు తమను తాము ఆన్‌లైన్ గేమింగ్ కమిషన్‌లో(Online Gaming Commission) నమోదు చేసుకోవాలి అంటూ కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది . ఈ కమిషన్ లో నమోదు చేసుకున్న గేమింగ్ కంపెనీల గేమ్ లకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది . రిజిస్ట్రేషన్ కోసం, కంపెనీలు గేమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి తమిళనాడు గేమింగ్ అసోసియేషన్ (Tamilnadu gaming Association)కార్యదర్శికి రూ. 1 లక్ష రుసుమును చెల్లించాలి . ఫైల్‌ను సమర్పించిన తర్వాత, అసోసియేషన్ దానిని క్షుణ్ణంగా సమీక్షిస్తుంది .తరువాత నిబంధనల ప్రకారం 15 రోజులలోపు వాటికి ఆమోదం తెలుపుతుంది లేదా తిరస్కరించవచ్చు కూడా .ఏదైనా ఫైల్‌లో తప్పుడు సమాచారం ఉంటే, సంఘం ఆ కంపెనీకి వివరణాత్మక నోటీసును జారీ చేస్తుంది, దానికి కంపెనీ 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి.
రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాలని తమిళనాడు అసెంబ్లీ గవర్నర్(Assembly Governor) ఆర్‌ఎన్ రవికి (R.N Ravi)బిల్లు పంపినప్పుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు (online Gaming)సంబంధించి ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు .దీని పర్యవేక్షణ కోసం సంఘం చైర్మన్‌ను నియమించటం జరుగుతుంది.ప్రభుత్వం రూపొందించిన ఈ కొత్త నియమం ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన చట్టంలో కొత్తగా ఏప్రిల్ 2023 తర్వాత రాష్ట్రంలో అమలు చేయబడుతుంది. దీంతో పాటు గేమింగ్ అసోసియేషన్‌కు(Gaming Association) చైర్మన్‌ను కూడా నియమించాలని ప్రభుత్వం చర్చలు జరిపింది.
తమిళనాడు రాష్ట్రంలో (Tamilnadu state)ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ లేదా బెట్టింగ్ గేమ్‌లను అక్కడ ప్రభుత్వం నిషేధించింది . నిజానికి ఈ గేమ్ ల కారణంగా చాలా మంది తమ ప్రాణాలను, పోగొట్టుకోవటం ,అప్పులపాలవ్వటం జరుగుతుంది . ఆన్లైన్ గేమింగ్(online gaming) పై రాష్ట్రంలో ప్రజల నిరసన తర్వాత ప్రభుత్వం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, రమ్మీ ఇంకా పేకాట వంటి ఆటలను నిషేధించింది.