నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)తీసుకొచ్చిన ఫాస్టాగ్‌(FASTAG) కొత్త రూల్స్‌ ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)తీసుకొచ్చిన ఫాస్టాగ్‌(FASTAG) కొత్త రూల్స్‌ ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మూడు నుంచి అయిదేళ్ల కిందట జారీ చేసిన ట్యాగులకు(Tag) ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీలోపు తప్పనిసరిగా అప్‌డేట్‌ కేవైసీ(KYC)ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అయిదేళ్ల కంటే పాతవైన ఫాస్టాగ్‌లను మార్చుకోవాల్సి ఉంటుంది. వెహికిల్ ఓనర్లు తన ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్, చాసిస్‌ నంబర్లకు అక్టోబర్‌ 31వ తేదీలోగా లింక్‌ అయ్యేలా చూసుకోవాలి. కొత్త వాహనాల యాజమానులైతే రిజిస్ట్రేషన్‌ నంబర్లను 90 రోజుల్లోగా అప్‌డేట్‌ చేయాలి. 30 రోజుల గడువులోగా చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు. ఫాస్టాగ్‌ ప్రొవైడర్లకు కూడా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా అదనంగా పలు రూల్స్‌ తీసుకొచ్చింది. వాహనానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని వెరిఫై చేసి డాటాబేస్‌ను అప్‌డేట్‌ చేయాలి. సులభంగా గుర్తించేలా వాహనం ముందు, పక్కవైపు ఫొటోలను స్పష్టంగా అప్‌లోడ్‌ చేయాలి.

ehatv

ehatv

Next Story