జీ20(G-20) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు వస్తున్నారు. వచ్చే అతిథులకు అద్భుతమైన ఆతిథ్యాన్ని(Hospitality) అందించడానికి కేంద్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Bidden), బ్రిటన్‌(Britain) ప్రధానమంత్రి రిషి సునాక్‌లతో(Rishi Sunak) పాటు ఇతర దేశాల అధినేతలకు వసతీ సౌకర్యాల నుంచి ప్రతీ అంశంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జీ20(G-20) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు వస్తున్నారు. వచ్చే అతిథులకు అద్భుతమైన ఆతిథ్యాన్ని(Hospitality) అందించడానికి కేంద్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Bidden), బ్రిటన్‌(Britain) ప్రధానమంత్రి రిషి సునాక్‌లతో(Rishi Sunak) పాటు ఇతర దేశాల అధినేతలకు వసతీ సౌకర్యాల నుంచి ప్రతీ అంశంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జీ 20 సదస్సు కోసం ఢిల్లీ నగరం పూర్తిగా భద్రతా(Security) వలయంలోకి వెళ్లింది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నాలుగు రోజుల పాటు ఇండియాలో ఉంటున్నారు. ఆయన కోసం హెటల్‌ ఐటీసీ మౌర్యలో గదులు కేటాయించారు. జో బైడెన్‌తో పాటు వచ్చే అమెరికా అధికారుల కోసం 400 గదులు కేటాయించారు.

మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో బైడెన్‌ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్‌ ఎనర్జీ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చిస్తారు. శని, ఆదివారాల్లో మోదీ జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రధాని హోదాలో తొలిసారి ఇండియాకు వస్తున్నారు. 43 ఏళ్ల రిషికి షాంగ్రి లా హోటల్‌ లో బస కల్పించారు. కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్‌ ప్రస్తుతం ఇండొనేషియా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ట్రూడో నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ది లలిత్ హోటల్‌లో జస్టిన్‌ ట్రూడోస్‌ బస చేస్తారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ మూడు దేశాల్లో పర్యటించబోతున్నారు. అందులో ముందుగా ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ సందర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. ఈయనకు ఇంపీరియల్‌ హోటల్‌లో బస చేయనున్నారు. ఈ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రావడం లేదన్న విషయం తెలిసిందే కదా! ఆయన స్థానంలో ఆ దేశ ప్రధాని లి కియాంగ్‌ వస్తున్నారు. చైనా ప్రధానితో పాటు ఆయన వెంట వస్తున్న బృందానికి తాజ్‌ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు.

Updated On 8 Sep 2023 12:00 AM GMT
Ehatv

Ehatv

Next Story