రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. స్పృహ కోల్పోయిన మహిళలు, పలువురికి గాయాలు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలిరావడంతో ప్లాట్‌ఫాం నెంబర్ 14 , 15లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

స్పహ కోల్పోయిన మహిళలకు సీపీఆర్ చేసి సమీపంలోని ఆస్పత్రులకు తరలితంచారు. ఇతర గాయపడిన ప్రయాణికులను కూడా ఆస్పత్రులకు తరలితంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణికులు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే, రైల్వే అధికారులు మాత్రం ఎలాంటి తొక్కిసలాట జరగలేదని చెబుతున్నారు.

టికెట్లు లేని ప్రయాణికులు ఒక్కసారిగా రావడమే ఇందుకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌లు రై్ల్వే స్టేషన్ వద్దకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్‌కు భారీగా పోలీసులు చేరుకున్నారు. టికెట్లు లేకుండా ప్రయాణికులు ఎలా వచ్చారో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

ehatv

ehatv

Next Story