తాజాగా నమోదైన కొవిడ్ -19 (covid -19) కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కొవిడ్(covid )ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు. ఈ మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది.
కరోనా(carona virus) వైరస్ మళ్లీ భారత్‌లో కోరలు చాస్తోంది. రోజు రోజుకు వేలల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 10,753 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలు దాటి 53,720కి చేరింది. గడిచిన 222 రోజుల తరువాత యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలుపైగా రావడం ఇదే తొలిసారి.
అయితే తాజాగా నమోదైన కొవిడ్ -19 (covid -19) కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కొవిడ్(covid )ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించారు. ఈ మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది. అయితే లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. రోజువారీ పాజిటివిటీ రేటు 6.78శాతంకు చేరగా.. వారపు పాజిటివిటీ రేటు 4.49శాతంగా ఉంది.
మరోవైపు దేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, యుపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి . ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు( Doctors) చెపుతున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే నెలలో కొవిడ్ -19 కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. మే నెల చివరి నాటికి 50 నుంచి 60వేల వరకు కొవిడ్ -19 కేసుల సంఖ్య చేరుకొనే అవకాశం ఉందని అగర్వాల్ అంచనా వేశారు. ఇందుకు రెండు కారణాలను తెలిపారు. మొదటిది వైరస్ తో పోరాడే సహజ రోగ నిరోధక శక్తి ఇప్పుడు 5శాతం మందిలో తగ్గింది. రెండో కారణం.. కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.
అయితే కరోనా కేసులు( Corona Cases) పెరుగుతున్నా.. ఇండియాలో ప్రజలు మాస్క్ వాడేందుకు ఆసక్తి చూపట్లేదు. కరోనా లేనప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉంటున్నారు. చాలా తక్కువ మందే మాస్క్ వాడుతున్నారు. ఐతే.. కేసులు ఇంకా పెరిగితే.. ప్రభుత్వాలు మాస్క్ మస్ట్ అనే కండీషన్ తెచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమల్లోకి తెచ్చారు. అయితే గర్భిణీలు, 60 ఏళ్లు దాటిన వారు, పిల్లలు కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలందరూ మాస్క్ లు తప్పకుండా ఉపయోగిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.