సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో అతి ప్రాచీన గ్రంధం భగవద్గీత కు గల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . మానవాళి జాగృతికి ,దేశ సంస్కృతికి ,విలువలకు ప్రస్తుత సమాజానికి భోద పడేలా ఈ గ్రంధంలోని అంశాలు ఎంతగానో దోహదం చేస్తాయి .

నేటి భవిష్యత్ తరాలకు ఇది చాల అవసరం . కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను బోధించనున్నారు. భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి “అన్నపూర్ణాదేవి” పార్లమెంట్ లో తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన జ్ఞానం. భగవద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మ తత్వం, జీవన గమ్యం, గమ్యసాధనా యోగాలు బోధించారు.భగవద్గీత హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి.ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యా శాఖ కార్యాచరణ ఇప్పటికే మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈ విషయం ఇప్పటికే పలు రాజకీయపార్టీలు విమర్శలు చేయడం జరుగుతుంది .