డార్క్ కామెడీ పేరుతో యూ ట్యూబర్ ప్రణీత్ హనుమంతు(Praneeth hanumanthu) చేసిన వికృతమైన, జుగుప్సాకరమైన వీడియోపై సకల వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో మనిషి రూపాన ఉన్న పశువు ప్రణీత్ దిగి వచ్చాడు.
డార్క్ కామెడీ పేరుతో యూ ట్యూబర్ ప్రణీత్ హనుమంతు(Praneeth hanumanthu) చేసిన వికృతమైన, జుగుప్సాకరమైన వీడియోపై సకల వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో మనిషి రూపాన ఉన్న పశువు ప్రణీత్ దిగి వచ్చాడు. సారీ తప్పయ్యిదంటున్నాడు. హద్దు దాటానని క్షమించాలని వేడుకుంటున్నాడు. ఇలాంటి పొరపాట్లు మరోసారి చేయనని ఒట్టేస్తున్నాడు. ప్రవీణ్ చేసింది మామూలు తప్పిదమైతే క్షమించి వదిలేయవచ్చు. కానీ అతడు చేసింది మహా దారుణం. క్షమార్హుడు కాడు. అతడిపై చట్ట ప్రకారం కఠినచర్యలు తప్పవని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించిన విషయం తెలిసిందే! జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ కూడా రియాక్టయ్యారు. 'తండ్రీకూతుళ్ల విషయంలో ఆ యూట్యూబర్లు ఇలా ప్రవర్తించడం, కామెంట్స్ చేయడం నిజంగా నీచమైన విషయం. మరింత జుగుప్సాకరమైన విషయం ఏమిటంటే.. ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయడం. దీనిపై స్పందించిన సాయి ధరమ్ తేజ, మంచు మనోజ్‌లను అభినందిస్తున్నాను. ఈ వ్యవహారంపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నాను’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రణీత్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ కూడా ఎక్స్ వేదికగా సారీ చెప్పాడు.
సినిమా ప్రచారంలో భాగంగానే ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని కార్తికేయ చెప్పుకొచ్చాడు. మరో హీరో సుధీర్ కూడా స్పందించాడు. హరోంహర సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహ్యం వేస్తోందని చెబుతూ క్షమాపణలు చెప్పారు. అలాంటి నీచుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలన్నా ధైర్యం చాలట్లేదని, నోటికి వచ్చినట్టు మాట్లాడ్డం భావప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదని సుధీర్‌బాబు పేర్కొన్నారు. మరో హీరో విశ్వక్‌సేన్ కూడా దీనిపై స్పందించారు. ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని ఎక్స్ వేదికగా చెప్పాడు.