అయోధ్య(Ayodhya) రామమందిరంలో(RAma Mandir) బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ముహూర్తం కోసం అఖిల దేశమూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిష్టాపన జరగనుంది.

అయోధ్య(Ayodhya) రామమందిరంలో(RAma Mandir) బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ముహూర్తం కోసం అఖిల దేశమూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిష్టాపన జరగనుంది. 1,500 నుంచి 1,600 వరకు ప్రముఖ అతిథులకు(Guest) ఆహ్వానం అందింది. అలాగే దాదాపు ఎనిమిది వేల మంది ఆహ్వానితులు రామమందిర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఆలయ ప్రారంభోత్సవ(Temple Inauguration) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi adityanath) , ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రసంగిస్తారు. ఇదిలా ఉంటే ఆహ్వాన పత్రికలో అక్షర దోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా(Social media) వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బహుశా ఈ ఆహ్వానపత్రికను నరేంద్రమోదీ రాసి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు.

Updated On 4 Jan 2024 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story