Anand Mahindra : మహీంద్రా గ్రూప్ షేర్లు కొనేందుకు లక్ష ఇస్తారా సార్.. ఆనంద్ మహీంద్రకు ఓ వ్యక్తి ఆసక్తికర ట్వీట్
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. సోషల్ మీడియాలో(Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో దాదాపుల 10 మిలియన్లకుపైగా ఫాలోవర్సు ఉన్నారు. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాకుండా.. దేశానికి మంచి పేరు తెచ్చిన క్రీడాకారులు(Sportspersons), ఇతర రంగాల్లో రాణిస్తున్నవారికి బహుమతులు ఇస్తూ ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపరుస్తారు.

anand mahindra
మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. సోషల్ మీడియాలో(Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో దాదాపుల 10 మిలియన్లకుపైగా ఫాలోవర్సు ఉన్నారు. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాకుండా.. దేశానికి మంచి పేరు తెచ్చిన క్రీడాకారులు(Sportspersons), ఇతర రంగాల్లో రాణిస్తున్నవారికి బహుమతులు ఇస్తూ ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపరుస్తారు. ఈ క్రమంలోనే ఓ ఫాలోవర్ నుంచి ఆనంద్ మహీంద్రకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
ఆనంద్ మహీంద్రన ఓ ఫాలోవర్ హిందీలో(Hindi) "సర్ ముజే 1 లాక్ చాయియే మహీంద్రా కా షేర్ ఖరిద్నా కా లియా అంటే "మహీంద్రా గ్రూప్ షేర్‌లను(Shares) కొనుగోలు చేయడానికి నాకు 1 లక్ష రూపాయలు కావాలి సార్" అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి ఆనంద్ మహీంద్రా కూడా తనదైన చతురతతో సమాధానం ఇచ్చారు. "ఆప్కీ హిమ్మత్ కే లియే తాలియాన్! పూచ్నే మే క్యా జాతా హై?" అంటే "మీ ధైర్యానికి చప్పట్లు కొడుతున్నా.. అడగడంలో తప్పు ఏంటి" అని మహీంద్రా ప్రతిస్పందించాడు. మహీంద్రా తేలికైన సమాధానానికి నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.
