లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Anapoorani) సినిమా వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఇది నయనతారకు 75వ సినిమా కావడం విశేషం. నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయ్‌, సత్యరాజ్‌, రెడిన్‌కింగ్స్‌ల ముఖ్యపాత్రలు పోషించారు. గత డిసెంబర్‌ 1వ తేదీన సినిమా విడుదలయ్యింది. ఆ సమయంలో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) నటించిన అన్నపూరణి(Annapoorani) సినిమా వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఇది నయనతారకు 75వ సినిమా కావడం విశేషం. నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయ్‌, సత్యరాజ్‌, రెడిన్‌కింగ్స్‌ల ముఖ్యపాత్రలు పోషించారు. గత డిసెంబర్‌ 1వ తేదీన సినిమా విడుదలయ్యింది. ఆ సమయంలో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. సినిమా రాంగ్‌ టైమ్‌లో రిలీజ్‌ కావడంతో సరిగ్గా ఆడలేకపోయింది. కొద్ది రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యింది. ఓటీటీ(OTT) ద్వారా అయినా కాసిన్ని కాసులు సంపాదించుకుందామనుకుంటే అక్కడా అదే పరిస్థితి. చిత్రంలో శ్రీరాముడు కూడా మాంసం(Non veg) తిన్నారు అన్న సంభాషణే సినిమాను చిక్కుల్లో పడేసింది.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, పైగా లవ్‌ జిహాద్‌ను ఆదరించే సినిమాగా ఉందని ముంబాయికి చెందిన శివసేనపార్టీ మాజీ అధ్యోఉడు రమేశ్‌ సోలంకి ముంబాయి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దగా అవుతుందేమోనన్న భయంతో నెట్‌ఫ్లిక్స్‌(Netflix) సంస్థ అన్నపూరణి సినిమా స్ట్రీమింగ్‌ను(treaming) నిలిపివేసింది. నెట్‌ఫ్లిక్స్‌ చర్యను చాలా మంది తప్పుపడుతున్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ కూడా అన్నపూరణి చిత్ర విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాడు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ఒక చిత్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓటీటీ నుంచి తొలగించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదని చెప్పారు వెట్రిమారన్‌(Vetrimaran). ఒక సినిమాను అనుమతించడానికై నా, నిషేధించడానికి అయినా సెన్సార్‌ బోర్డుకు మాత్రమే అధికారం ఉంటుందన్నారు. సెన్సార్‌ బోర్డు అధికారాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ప్రశ్నార్థకంగా మార్చేసిందని వెట్రిమారన్‌ అన్నారు.

Updated On 17 Jan 2024 4:02 AM GMT
Ehatv

Ehatv

Next Story