ఈ రోజున ప్రపంచమంతా మిమిక్రీ దినోత్సవాన్ని(International Mimicry Day) జరుపుకుంటోంది. మిమిక్రీకి పర్యాయపదంగా నిలిచిన నేరెళ్ల వేణుమాధవ్(Nerella Venumadhav) జయంతిని పురస్కరించుకుని ఈ మిమిక్రీ డేను జరుపుకుంటున్నారు. 1932, డిసెంబర్ 28న వరంగల్ మట్టెవాడలో ప్రముఖ వ్యాపారవేత్త నేరెళ్ల శ్రీహరి- శ్రీలక్షి దంపతులకు 12వ సంతానంగా జన్మించారు వేణుమాధవ్. నేరెళ్ల శ్రీహరి బహుభాషా వేత్త, సాహిత్యాభిమాని కావడంతో వరంగల్‌కు వచ్చే ప్రఖ్యాత సాహితీవేత్తలు, కళాకారులు ఈయన ఇంటనే బస చేసేవారు. దాంతో సాహితీ గోష్టులు, కళాప్రదర్శనలు విరివిగా జరిగేవి. వీటి ప్రభావం వేణుమాధవ్‌పై పడింది.
ఈ రోజున ప్రపంచమంతా మిమిక్రీ దినోత్సవాన్ని(International Mimicry Day) జరుపుకుంటోంది. మిమిక్రీకి పర్యాయపదంగా నిలిచిన నేరెళ్ల వేణుమాధవ్(Nerella Venumadhav) జయంతిని పురస్కరించుకుని ఈ మిమిక్రీ డేను జరుపుకుంటున్నారు. 1932, డిసెంబర్ 28న వరంగల్ మట్టెవాడలో ప్రముఖ వ్యాపారవేత్త నేరెళ్ల శ్రీహరి- శ్రీలక్షి దంపతులకు 12వ సంతానంగా జన్మించారు వేణుమాధవ్. నేరెళ్ల శ్రీహరి బహుభాషా వేత్త, సాహిత్యాభిమాని కావడంతో వరంగల్‌కు వచ్చే ప్రఖ్యాత సాహితీవేత్తలు, కళాకారులు ఈయన ఇంటనే బస చేసేవారు. దాంతో సాహితీ గోష్టులు, కళాప్రదర్శనలు విరివిగా జరిగేవి. వీటి ప్రభావం వేణుమాధవ్‌పై పడింది. వర దక్షిణ, గయ్యాళి గంగమ్మ వంటి చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాలలో విద్యార్థిగా ఉన్నప్పడే వేణుమాధవ్ నటించారు. వేణుమాధవ్‌లో మంచి నటుడు ఉన్నాడు. సినిమాల్లో అనేక అవకాశాలు కూడా వచ్చాయి. కానీ వాటి మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. మిమిక్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తులనే కాకుండా, సంగీత వాయిద్యాలను, మన చుట్టూ వినిపించే అనాకేనాక శబ్దాలను అనుకరించేవారు. మిమిక్రీ కళను కొత్త పుంతలు తొక్కించాడు.ఇంగ్లీషు సినిమాల్లోని నటీనటుల గొంతులు, ముఖ్యమైన సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్ తో సహా వినిపించడం వేణుమాధవ్ ప్రత్యేకత. చార్ల్ టన్ హెస్టన్ (Charlton Heston) మోజెస్ (Moses) గా సిసిల్ డెమిల్లి (Cecil B. DeMille) దర్శకత్వంలో వచ్చిన ది టెన్ కమాండ్మెంట్స్ (The Ten Commandments) సినిమాలోని కీలక సన్నివేశాపి అరగంట పాటు డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్, గుర్రాల సకిలింపులు, డెక్కల చప్పుడు... అన్నింటితో సహా మిమిక్రీ చేయడం నేరేళ్ల పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోయింది. హామ్లెట్ (Hamlet), మెకన్నాస్ గోల్డ్ (McKanna’s Gold) వంటి ప్రసిద్ధ హాలీవుడ్ సినిమాల సీన్స్ కూడా అనుకరించి అందరి మెప్పు పొందారు. 2018 జూన్ లో ఇక సెలవంటూ వెళ్లిపోయారు.