చంద్రయాన్‌-3(Chandrayaan-3) సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-4(Chandrayaan-4) ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్‌ స్ఫూర్తితో చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో). అయితే చంద్రయాన్‌-3లో 30 కిలోల రోవర్‌ను పంపగా ఈ సారి 350 కిలోల భారీ రోవర్‌ను(Rover) పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఇస్రో. లుపెక్స్‌ పేరుతో చంద్రయాన్-4 లక్ష్యాన్ని ఇస్రో పెట్టుకుంది. చంద్రయాన్‌-4లో భాగంగా చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలన్న లక్ష్యాన్ని ఇస్రో నిర్ధారించుకుంది.

చంద్రయాన్‌-3(Chandrayaan-3) సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-4(Chandrayaan-4) ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్‌ స్ఫూర్తితో చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో). అయితే చంద్రయాన్‌-3లో 30 కిలోల రోవర్‌ను పంపగా ఈ సారి 350 కిలోల భారీ రోవర్‌ను(Rover) పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఇస్రో. లుపెక్స్‌ పేరుతో చంద్రయాన్-4 లక్ష్యాన్ని ఇస్రో పెట్టుకుంది. చంద్రయాన్‌-4లో భాగంగా చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలన్న లక్ష్యాన్ని ఇస్రో నిర్ధారించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీల్‌ దేశాయ్‌(Neilesh Desai) వెల్లడించారు. చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం లునార్ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రయాన్‌-3లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆక్షాంశం వద్ద ల్యాండర్ దిగడం తెలిసిందే. క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా ప్రయోగించి ఇస్రో చరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవంపై రోవర్‌ను ల్యాండ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ రికార్డ్‌ సృష్టించింది. చంద్రయాన్-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ను దించనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగంలో 30 కిలోల బరువు ఉన్న రోవర్‌ను పంపిస్తే.. చంద్రయాన్-4 ఈ రోవర్‌ బరుకు 350 కిలోలు ఉండబోతుంది. దాదాపు కిలో మీటరు మేర చంద్రుడి మీద తిరగనుంది. చంద్రయాన్-3 మిషన్ జీవిత కాలం ఒక లూనార్ డే అంటే భూమి మీద పద్నాలుగు రోజులకు చంద్రుడి మీద ఒక రోజు సమానం.
చంద్రయాన్-4 ప్రయోగంలో 7 లూనార్ రోజులు పని చేసేలా రూపొందిస్తున్నారు. అంటేభూమి మీద వంద రోజులకు సమానం. చంద్రయాన్-4లో ప్రధాన అంశమేంటంటే చంద్రుడిపై రాళ్లు, మట్టిని రోవర్‌లోని పలు పరికరాలు సేకరించి వాటిని భూమి మీదికి తీసుకురానున్నాయి. చంద్రయాన్-4లో భాంగా జపాన్‌ అంతరిక్ష సంస్థతో కలిసి ఇస్రో పనిచేయనుంది. అయితే దీనికి దాదాపుగా ఐదేళ్ల సమయం పట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఐదు నుంచి 10 ఏళ్లు పట్టే అవకాశముందంటున్నారు.

Updated On 20 Nov 2023 4:14 AM GMT
Ehatv

Ehatv

Next Story