ట్రిపుల్‌ తలాక్‌(Triple Talaq) భయంతో ఓ ముస్లిం యువతి(Muslim Woman) హిందూమతాన్ని పుచ్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీలో(Bareli) ఈ ఘటన చోటు చేసుకుంది. నేహా అస్మత్‌(Neha Asmat) అనే ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌(Teacher) హిందు మతాన్ని స్వీకరించి తన పేరును నేహాసింగ్‌గా(Neha singh) మార్చుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్‌ ఆలయానికి వెళ్లి తన పేరును నేహాసింగ్‌గా మార్చుకుంది. మధ్య వయస్కుడితో పెళ్లి ఇష్టం లేకే తాను ఇష్టపూర్వకంగా హిందుమతాన్ని స్వీకరించానని నేహాసింగ్‌ చెబుతున్నారు.

మధ్య వయస్కుడితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు కోరుకోవడం వల్లే తాను ఈ పని చేస్తున్నానని ప్రకటించారు.ఇదిలా ఉంటే తన కూతురు నేహా అస్మత్‌ను సంజయ్‌ నగర్‌కు చెందిన మోహిత్‌ సింగ్‌(Mehit Singh) అనే వ్యక్తి కిడ్నాప్‌(Kidnap) చేశారని తల్లి రాణి బేగం(Rani begum) బరాదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహిత్‌సింగ్‌, నేహా సింగ్‌ ఒకే స్కూల్‌లో పని చేస్తున్నారు. తనకు కానీ, మోహిత్‌సింగ్‌ కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే అందుకు తన కుటుంబమే బాధ్య వహించాలని నేహా చెబుతున్నారు. తనకు భద్రత కల్పించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన తండ్రి అస్మత్‌ అలీ చనిపోయిన తర్వాత విడాకులు తీసుకున్న వ్యక్తిని తనకిచ్చి కట్టబెట్టాలని తన తల్లి, సోదరి, బావ, మరొకరు ఒత్తిడి తెచ్చారని, ఆ పెళ్లి ఇష్టం లేకే ఇంటి నుంచి వెళ్లిపోయానని నేహా తెలిపారు. చిన్నప్నట్నుంచి శివుడిపై విశ్వాసం ఉందని, అందుకే తాను హిందువుగా మారానని నేహా పేర్కొన్నారు.

Updated On 29 Dec 2023 3:30 AM GMT
Ehatv

Ehatv

Next Story