రాజస్తాన్‌లోని(rajasthan) కోటా(Kota) నగరం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో సందడిగా ఉంటున్నమాట నిజమే అయినా ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్య(Suicide) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. లేటెస్ట్‌గా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. రాజస్తాన్‌లోని బమన్‌వాస్‌(Bamanwas) ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా నీట్‌(Neet) ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ కావడానికి కోటాకు వచ్చాడు.

రాజస్తాన్‌లోని(rajasthan) కోటా(Kota) నగరం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో సందడిగా ఉంటున్నమాట నిజమే అయినా ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్య(Suicide) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. లేటెస్ట్‌గా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. రాజస్తాన్‌లోని బమన్‌వాస్‌(Bamanwas) ప్రాంతానికి చెందిన రాజేంద్ర మీనా నీట్‌(Neet) ఎగ్జామ్‌కు ప్రిపేర్‌ కావడానికి కోటాకు వచ్చాడు. అదృశ్యమవ్వడానికి ముందు అతడి తల్లిదండ్రులకు ఓ సందేశం పంపించాడు. అది చూసే అతడి తండ్రి జగదీశ్‌ మీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేంద్ర మీనా ఏం రాశాడంటే..‘నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. పైచదువులు చదవాలని లేదు. నా దగ్గర అయిదు వేల రూపాయలు ఉన్నాయి. అయిదు సంవత్సరాల వరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తాను. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నా గురించి బాధపడొద్దని అమ్మకు చెప్పండి. నా దగ్గర మీ అందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్‌ చేస్తాను’ అని తన ఫోన్‌ నుంచి కుటుంబానికి మెసేజ్‌ చేశాడు. ఈ నెల 6వ తేదీ నుంచి అతడు కనిపించడం లేదని, ఆ రోజు మధ్యాహ్నం తన హాస్టల్ వదిలివెళ్లిపోయాడని తండ్రి జగదీశ్‌ చెబుతున్నారు. లాస్ట్ సండే నీట్‌ ఎగ్జామ్‌ అయిపోయింది. మంచి ర్యాంకు రాదనే భయంతో రాజేంద్ర పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated On 9 May 2024 4:56 AM GMT
Ehatv

Ehatv

Next Story