2024 పారిస్ ఒలింపిక్స్‌ను(Paris Olympics) నీరజ్ చోప్రా(Neeraj chopra) అద్భుతంగా ఆరంభించాడు

2024 పారిస్ ఒలింపిక్స్‌ను(Paris Olympics) నీరజ్ చోప్రా(Neeraj chopra) అద్భుతంగా ఆరంభించాడు. తన తొలి త్రో తోనే దేశానికి పతకంపై ఆశ కల్పించాడు. గ్రూప్ బి క్వాలిఫికేషన్ రౌండ్ మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైంది. నీరజ్ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను(Javelin) 89.34 మీట‌ర్ల‌ దూరం విసిరి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 11న రాత్రి 11:55 గంటలకు IST ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నీరజ్ చోప్రా తన గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

నీరజ్ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో రెండో గోల్డ్ మెడల్‌పై ఆశ‌లు రేకెత్తించాడు. అంతకు ముందు నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. గ‌త‌ ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం 7 పతకాలు సాధించింది. అప్పుడు నీరజ్ మాత్ర‌మే స్వర్ణ పతకం సాధిస్తాడ‌ని అంతా భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story