మహారాష్ట్ర(Maharastra) రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్(Sarad Pawar) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం(Party Foormation Day) సందర్భంగా పార్టీలో రెండు ముఖ్యమైన మార్పులు చేశారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రఫుల్ పటేల్(Praful Patel), సుప్రియా సూలేలను(Supriya Sule) నియమిస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు.
మహారాష్ట్ర(Maharastra) రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్(Sarad Pawar) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం(Party Formation Day) సందర్భంగా పార్టీలో రెండు ముఖ్యమైన మార్పులు చేశారు. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రఫుల్ పటేల్(Praful Patel), సుప్రియా సూలేలను(supriya Sule) నియమిస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు శరద్ పవార్.. సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌లకు కొత్త బాధ్యతలను కూడా అప్పజెప్పారు. సుప్రియకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌ల బాధ్యతలు..
ప్రఫుల్ పటేల్‌కు మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్‌లకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. శరద్ పవార్ తీసుకున్న ఈ నిర్ణయం అజిత్ పవార్‌కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. అయితే అజిత్ పవార్(Ajith Pawar) సమక్షంలోనే ఈ ప్రకటన వెలువడింది. 1999లో శరద్ పవార్, పీఏ సంగ్మా కలిసి స్థాపించిన ఎన్సీపీ 25వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శరద్ పవార్ గత నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవార్ ఆఫర్‌పై చర్చించేందుకు ఏర్పాటైన ఎన్‌సిపి ప్యానెల్ మే 5న ఆయన రాజీనామాను తిరస్కరించి, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరింది. దీంతో ఆయన రాజీనామా ఉపసంహరించుకున్నారు.