మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన దాదాపు అన్ని పాఠ్యాంశాలను సిలబస్‌ నుంచి తొలగిస్తోంది ఎన్‌సిఈఆర్‌టి. ఇక నుంచి ఈ సిలబస్‌లో మొఘల్‌ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠాలేమీ కనిపించవు. 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాల నుంచి మొఘల్స్‌ పాలనను తొలగించారు. థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2లో ఉన్న కింగ్స్‌ అండ్ క్రానికల్స్‌ ది మొఘల్ కోర్టు అనే సిలబస్‌ను పూర్తిగా తొలగించారు. వీటికి సబంధించి హిందీ పుస్తకాల నుంచి కొన్ని పద్యాలు, కొన్ని పేరాగ్రాఫ్స్‌ను కూడా ఎన్‌సిఈఆర్‌టి తొలగించింది.

భారతదేశ చరిత్రలోంచి మొఘల్‌ పేరు నెమ్మదిగా తొలగిపోతున్నది. మొఘల్‌ అన్న పేరు మోదీ సర్కారుకు అంతగా రుచించదు.. అందుకే మొఘల్‌ గార్డెన్స్‌ పేరు కూడా మార్చేశారు. ఇక నుంచి మొఘలుల పాలన, ఆ రాజులు చేసిన మంచి పనులు, సాగించిన దారుణాలు ఇవన్నీ చరిత్రలోంచి మాయం కాబోతున్నాయి. మనం చదువుకున్న చరిత్ర ప్లేస్‌లో కొత్త చరిత్ర రాబోతున్నది. ఈ తరం విద్యార్థులకు మొఘల్‌ అంటే ఏమిటో తెలియకపోవచ్చు. మొఘల్‌ సామ్రాజ్యానికి చెందిన దాదాపు అన్ని పాఠ్యాంశాలను సిలబస్‌ నుంచి తొలగిస్తోంది ఎన్‌సిఈఆర్‌టి. ఇక నుంచి ఈ సిలబస్‌లో మొఘల్‌ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠాలేమీ కనిపించవు. 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాల నుంచి మొఘల్స్‌ పాలనను తొలగించారు. థీమ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ పార్ట్‌-2లో ఉన్న కింగ్స్‌ అండ్ క్రానికల్స్‌ ది మొఘల్ కోర్టు అనే సిలబస్‌ను పూర్తిగా తొలగించారు. వీటికి సబంధించి హిందీ పుస్తకాల నుంచి కొన్ని పద్యాలు, కొన్ని పేరాగ్రాఫ్స్‌ను కూడా ఎన్‌సిఈఆర్‌టి తొలగించింది.

ఒక్క చరిత్ర మీదనే పడలేదు. పౌరశాస్త్రం మీద కూడా ఎన్‌సిఈఆర్‌టి పడింది. సివిక్స్‌లో కూడా మార్పులు చేర్పులు చేసింది. 12వ తరగతి సివిక్స్‌లో ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం, అంతర్యుద్ధ దశ అనే పాఠాలను తొలగించింది. ఇండియన్‌ పాలిటిక్స్‌ ఆఫ్టర్‌ ఇండిపెండెన్స్‌ అనే పాఠ్యాంశం నుంచి రైజ్‌ ఆఫ్‌ పాపులర్‌ మూవ్‌మెంట్స్‌ , ఎరా ఆఫ్‌ వన్‌ పార్టీ డామినెన్స్‌ అనే రెండు ఛాప్టర్లను కూడా తొలగించింది. పదో తరగతి సిలబస్‌లో కూడా మార్పులు జరిగాయి. డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌-2 నుంచి ప్రజాస్వామ్యం -వైవిధ్యం, ప్రజాపోరాటాలు-ఉద్యమాలు, ప్రజాస్వామ్య సవాళ్లు వంటి ఛాప్టర్లు మాయమయ్యాయి. 11వ తరగతి పాఠ్యపుస్తకం థీమ్స్‌ ఇన్‌ వరల్డ్ హిస్టరీ నుంచి సెంట్రల్‌ ఇస్లామిక్‌ ల్యాండ్స్‌, క్లాష్‌ ఆఫ్ కల్చర్స్‌, ఇండస్ట్రియల్‌ రివల్యూషన్ వంటి ఛాప్టర్లను తొలగించింది ఎన్‌సిఈ ఆర్‌టి. కొత్త సిలబస్‌ ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తుందని ఎన్‌సీఈఆర్‌టి చెబుతోంది. ఇదిలాఉంటే ఎన్‌సీఈఆర్‌టి రూపొందించిన సిలబస్‌ను అనుసరిస్తున్న బోర్డులు కూడా ఈ పాఠ్యాంశాలను మార్చుకోవాల్సి ఉంటుంది.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story