పాఠ్యపుస్తకాలలో(Text books) మార్పులు చేర్పులు చేయడమే పనిగా పెట్టుకుంది ఎన్‌సీఈఆర్‌టీ(NCERT). 12వ తరగతి పొలటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో పలు మార్పులు చేసింది.
పాఠ్యపుస్తకాలలో(Text books) మార్పులు చేర్పులు చేయడమే పనిగా పెట్టుకుంది ఎన్‌సీఈఆర్‌టీ(NCERT). 12వ తరగతి పొలటికల్ సైన్స్(Political science) పాఠ్యపుస్తకంలో పలు మార్పులు చేసింది. బాబ్రీ మసీదు(Babri mosque) అనే పదాన్ని పూర్తిగా తొలగించి దానిని మూడు గుమ్మటాల నిర్మాణంగా సంబోధించింది. రాముడి రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమంలో కరసేవకుల పాత్ర, బాబ్రీమసీదు కూల్చివేత తర్వాత చెలరేగిన హింస, రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాలతో ఉన్న నాలుగు పేజీల అయోధ్య చాప్టర్‌ను రెండు పేజీలకు కుదించింది. అందుకు కారణాలు కూడా చెప్పుకొచ్చింది. విద్యలో ద్వేషం, హింస పాఠ్యాంశాలుగా ఉండకూడదనీ, వాటిపై విద్యార్థులు దృష్టి పెట్టకూడదనీ తమ ఉద్దేశమని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అంటున్నారు. విద్యార్థులకు బోధించే అంశాలను కాషాయీకకరిస్తున్నారనే ఆరోపణలలో నిజం లేదని చెప్పుకొచ్చారు.