దేశంలో టమాట ధరలు(Tomato Prices) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ప్రాంతాలలో కిలో టమాట 200 రూపాయలు దాటింది కూడా! మన దగ్గర కిలో 150 రూపాయలకు అమ్ముతున్నారు. దాంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి ప్రజలైతే టమాటను తమ పద్దులోంచి తొలగించారు. జనం ఇంతగా అవస్థలు పడుతున్నారని తెలుసుకుని ఎన్‌సిసిఎఫ్(NCCF) టమాటలను కిలో 70 రూపాయలకే అందిస్తోంది.
దేశంలో టమాట ధరలు(Tomato Prices) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ప్రాంతాలలో కిలో టమాట 200 రూపాయలు దాటింది కూడా! మన దగ్గర కిలో 150 రూపాయలకు అమ్ముతున్నారు. దాంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి ప్రజలైతే టమాటను తమ పద్దులోంచి తొలగించారు. జనం ఇంతగా అవస్థలు పడుతున్నారని తెలుసుకుని ఎన్‌సిసిఎఫ్(NCCF) టమాటలను కిలో 70 రూపాయలకే అందిస్తోంది. ఓఎన్‌డీసీ(ONDC) కొనుగోలుదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలను విధించుండా ఆన్‌లైన్‌లో కేవలం 70 రూపాయలకే ఇస్తోంది. దీని కోసం పేటీఎం(paytm) యాప్ ద్వారా కస్టమర్ ఆర్డర్ చేయవచ్చని, ఒక కస్టమర్ కేవలం రెండు కిలోల టమాటలను మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ టి.కోశి(T.Koshi) తెలిపారు. ఈ సదుపాయం ప్రస్తానికి ఢిల్లీ(Delhi) ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. పెరుగుతోన్న టమాట ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టమాటలను సబ్సిడీపై అమ్మాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) , నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NAFED) లను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదట్లో కిలో టమాటలను 90 రూపాయలకు అమ్మారు. జులై 16 నుంచి కిలో టమాటను 80 రూపాయలకు అమ్మారు. జూలై 20 నుంచి కిలో 70 రూపాయలకు ఇవ్వడం మొదలు పెట్టారు. మొత్తంగా టమాట విషయంలో జనానికి కొంత వెసులుబాటు కలిగింది.