డిజిటల్ టెక్నాలజీ, కరోనా పుణ్యమా అని దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్ల (UPI Payments) వినియోగం వేగంగా, విస్తృతంగా పెరిగిపోయింది. టీ స్టాల్స్, చిన్నచిన్న కిరాణా దుకాణాల నుంచి పెద్దపెద్ద షాపింగ్ కాంప్లెక్సుల వరకు అన్నిచోట్లా యూపీఐ లావాదేవీలు (UPI transactions) విరివిగా కొనసాగుతున్నాయి.

🌼న్యూఢిల్లీ: డిజిటల్ టెక్నాలజీ, కరోనా పుణ్యమా అని దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్ల (UPI Payments) వినియోగం వేగంగా, విస్తృతంగా పెరిగిపోయింది. టీ స్టాల్స్, చిన్నచిన్న కిరాణా దుకాణాల నుంచి పెద్దపెద్ద షాపింగ్ కాంప్లెక్సుల వరకు అన్నిచోట్లా యూపీఐ లావాదేవీలు (UPI transactions) విరివిగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండానే సేవలు పొందుతున్నప్పటికీ.. ఏప్రిల్ 1 నుంచి కొన్ని సేవలపై ఛార్జీలు వర్తించబోతున్నాయి. యూపీఐ ద్వారా జరిపే మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు ప్రీపేయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) ఛార్జీలు వర్తించబోతున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటివలే ఒక సర్క్యూలర్ విడుదల చేసింది. మర్చంట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు (Marchant transactions charges) ఏప్రిల్ 1, 2023 నుంచి వర్తించబోతున్నాయని వెల్లడించింది.

🌼పీపీఎల్ (Prepaid Payment Instrument) ఉపయోగించి రూ.2000లకుపైగా వ్యాల్యూతో యూపీఐ చెల్లింపులు చేస్తే 1.1 శాతం ఇంటర్‌‌చేంజ్ ఛార్జీ వర్తిస్తుంది. ఎన్‌పీసీఐ సర్క్యూలర్ ప్రకారం... ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మర్చంట్ కోడ్స్ ఈ విధంగా ఉన్నాయి. టెలికం 0.7 శాతం, మ్యూచువల్ ఫండ్ 1 శాతం, యుటిలిటీస్/పోస్ట్ ఆఫీస్ 0.7 శాతం, విద్య 0.7 శాతం, ప్రభుత్వ రంగానికి 1 శాతంగా ఛార్జీలు ఉన్నాయి. ఇక సూపర్‌మార్కెట్ 0.9 శాతం, ఇంధనం 0.5 శాతం, ఇన్సూరెన్స్ 1 శాతం, రైల్వేస్ 1 శాతం, వ్యవసాయం 0.7 శాతంగా ఉన్నాయి. ఇక పీపీఐ ఇష్యూయర్ 15 బేసిస్ పాయింట్లకుపైగా వాలెట్ లోడింగ్ సర్వీస్ ఛార్జీని రిమిటర్ బ్యాంక్‌కు చెల్లిస్తాయి. అయితే బ్యాంక్ అకౌంట్, పీపీఐ వాలెట్ మధ్య పీ2పీ (peer-to-peer) ఇంటర్‌ఛార్జ్, పీ2పీఎం (peer-to-peer-merchant) లావాదేవీలకు ఇంటర్‌చేంజ్ ఛార్జీ వర్తించదు

Updated On 29 March 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story