ఈ రోజుల్లో సైబర్ క్రైం గుర్తింపు చాలా ముఖ్యమైంది పెరుగుతున్న సాంకేతికతతో, సైబర్ నేరాలు పెరిగిపోయాయి.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) న్ ఇండియా నటి రష్మిక మందన్నను(Rashmika mandana) 'సైబర్ సేఫ్టీని(Cyber saftey) ప్రోత్సహించే జాతీయ అంబాసిడర్( national ambassador)'గా నియమించింది. ఆన్‌లైన్ మోసం(Online fraud), డీప్‌ఫేక్ వీడియోలు(deepfake videos), సైబర్ బెదిరింపు, AI- రూపొందించిన హానికరమైన కంటెంట్‌తో సహా వివిధ సైబర్‌క్రైమ్ బెదిరింపులపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైబర్ అవగాహన ప్రచారాలకు రష్మిక నాయకత్వం వహిస్తుంది. ఈ రోజుల్లో సైబర్ క్రైం గుర్తింపు చాలా ముఖ్యమైంది పెరుగుతున్న సాంకేతికతతో, సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ క్రైమ్‌ల పర్యవసానాలవల్ల చాలా నష్టపోతున్నారు. వ్యక్తులు, వ్యాపారాలను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. స్వయంగా సైబర్ క్రైమ్ బాధితురాలు రష్మిక. రష్మిక డీప్‌ఫేక్ వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. ఈ కేసులో నిందితుడిని పోలీసు అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాలు, కమ్యూనిటీలను ప్రభావితం చేసే ప్రమాదకరమైందని తెలిపింది. దీనిని అనుభవించిన వ్యక్తిగా, ఈ సమస్యలపై అవగాహన పెంచడానికి, సైబర్ సందేశాన్ని ప్రచారం చేయడానికి తాను అంకితభావంతో ఉన్నట్లు ప్రకటించింది. సైబర్‌ సేఫ్టీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మికు నియమిస్తే ప్రజలకు తన ద్వారా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Eha Tv

Eha Tv

Next Story