National Book Trust : కథలు చెప్పడంలో మనోళ్లే తోపులు..!
కేంద్ర విద్యాశాఖ ఆధ్వరంలోని నేషనల్ బుక్ ట్రస్ట్(National Book Trust) పుణెలో(Pune) ఓ కార్యక్రమం నిర్వహించింది. అదేంటంటే పిల్లలకు తల్లిదండ్రులు కథలు(stories) చెప్పాలి. పుణెలో ఉన్న ఎస్‌పీ కాలేజ్ గ్రౌండ్స్‌లో(SP college Grounds) జరిగిన ఈ కార్యక్రమంలో 3,250 మంది పేరెంట్స్, వారి పిల్లలు పాల్గొన్నారు.
కేంద్ర విద్యాశాఖ ఆధ్వరంలోని నేషనల్ బుక్ ట్రస్ట్(National Book Trust) పుణెలో(Pune) ఓ కార్యక్రమం నిర్వహించింది. అదేంటంటే పిల్లలకు తల్లిదండ్రులు కథలు(stories) చెప్పాలి. పుణెలో ఉన్న ఎస్‌పీ కాలేజ్ గ్రౌండ్స్‌లో(SP college Grounds) జరిగిన ఈ కార్యక్రమంలో 3,250 మంది పేరెంట్స్, వారి పిల్లలు పాల్గొన్నారు. ఇందులో తల్లిదండ్రులు తమ పిల్లలకు నాలుగు నిమిషాలపాటు ఏకధాటిగా స్టోరీస్ చెప్పాలని షరతు విధించారు. అసలే మనోళ్లు కథలు చెప్పడంలో తోపులు కదా. ఇంకేముంది రెచ్చిపోయారు. ఇందులో పాల్గొన్న 3,250 మందిలో 3,066 మంది విజయవంతంగా తమ పిల్లలకు కథలు చెప్పినట్లు నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రకటించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో(Guinness Book of Records) ఈ కార్యక్రమం నిలిచింది. పిల్లలకు కథలు చెప్పడంలో భారతీయ తల్లిదండ్రులు చైనాను(China) వెనక్కు నెట్టి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు.